రాష్ట్రీయం

ఆశయం కను‘మరుగు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: స్వచ్ఛ్భారత్ మిషన్ (గ్రామీణ) కింద ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, దాని ప్రభావం అంతంతమాత్రంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరుగు కోసం ఇంకా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. దేశవ్యాప్తంగా నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ సర్వే నిర్వహించి స్వచ్ఛ స్టేటస్ రిపోర్టును ఇటీవల ప్రచురించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 48 శాతం మందికి మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. బహిరంగ మల విసర్జన అన్నది గ్రామీణులకు అలవాటుగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
స్వచ్ఛ భారత్ నివేదికను రూపొందించేందుకు నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ దేశవ్యాప్తంగా గ్రామాల్లో 73,538, పట్టణ ప్రాంతాల్లో 41,538 ఇళ్లల్లో సర్వే నిర్వహించింది. వ్యక్తిగత టాయిలెట్లు కలిగి ఉండటం లేదా వాడేందుకు అందుబాటులో ఉండటాన్ని అంచనా వేసేందుకు ఈ సర్వేను నిర్వహించింది. స్వచ్ఛ్భారత్ మిషన్ (గ్రామీణ)ను అక్టోబర్ 2014లో ప్రారంభించాక దేశవ్యాప్తంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం 8 శాతం మేరకు పెరిగినట్లు గుర్తించారు.
ఆర్థిక పరిస్థితి కూడా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించలేని స్థితికి కారణమని తెలుస్తోంది. గ్రామాల్లో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లకు నీటి సరఫరా కూడా సమస్యగా మారింది. నిర్మించిన మరుగుదొడ్లలో కేవలం 47 శాతం మరుగుదొడ్లకే నీటి సరఫరా వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో 52.5 శాతం మేరకు గ్రామాల్లో, 11.8 మేరకు పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 65 శాతం మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇది 52 శాతానికి తగ్గింది. కొంతమంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నా, ఆరుబయట వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. కాగా వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్న ఇళ్లకు సంబంధించి 18.8 శాతంతో జార్ఖండ్, 21.2 శాతంతో చత్తీస్‌గఢ్, 26.3 శాతంలో ఒడిశా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.