రాష్ట్రీయం

తెలంగాణ అభివృద్ధిపై అమెరికావాసుల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: అమెరికాలోని తెలంగాణ వాదులు సైతం రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తెజావత్ అన్నారు. తెజావత్ ఢిల్లీలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించామన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వారు బంగారు తెలంగాణ సాధించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అమెరికాలోని ప్రవాసులకు వివరించామన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకునేందుకు అనేక మంది ముందుకొచ్చారని తెలిపారు.