రాష్ట్రీయం

10న విజయవాడలో హెల్త్ సమ్మిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: మరో అంతర్జాతీయ సదస్సుకు విజయవాడ వేదిక కాబోతోంది. వచ్చే నెల 10న నగరంలో ఇంటెలిజెంట్ హెల్త్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సులో సుమారు 500కి పైగా దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సులో వైద్య ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు సోమవారం విజయవాడలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. కామన్‌వెల్త్ మెడికల్ అసోసియేషన్ ట్రస్ట్ (యుకె) వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ అరుల్ రాజ్, బుల్ డైర్స్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి శ్రీనాథరెడ్డి, డాక్టర్ ప్రవీణ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

చిత్రం విజయవాడలో ఏపి సిఎంను కలిసి ఆహ్వానించిన హెల్ త సమ్మిట్ నిర్వాహకులు