రాష్ట్రీయం

ఆలయాల్లో సర్వీస్ రూల్స్ అమలు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ నిబంధనలను (కొత్త సర్వీస్ రూల్స్‌ను) అమలు చేయాలని అర్చకులు కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ హెరిడిటీ అర్చకా క్వాలిఫికేషన్స్ అండ్ ఎండోమెంట్ రూల్స్, 2015’ను తక్షణమే ఆమోదించి అమలు చేయాలని అర్చక సంఘాలు కోరుతున్నాయి. ఎపి అర్చక సమాఖ్య, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం ఈ మేరకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒక లేఖలో కోరాయి. సర్వీస్‌రూల్స్‌ను ముఖ్యమంత్రి ఆమోదిస్తే వేలాది మంది వంశపారంపర్య అర్చకులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు 2015 డిసెంబర్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పెండింగ్‌లో ఉందని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్ సిఎస్ రంగరాజన్, ఎపి అర్చక సమాఖ్య ప్రతినిధులు ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు తెలిపారు. సోమవారం వారు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని వివరించారు. దేవాలయాలకు భక్తులు వేర్వేరు రూపాల్లో సమర్పించుకునే నిధుల నుండి ప్రభుత్వం 21.50 శాతం నిధులను తమ ఖాతాలోకి (ప్రభుత్వ ఖజానా-ట్రెజరీ) జమ చేసుకుంటోందని గుర్తు చేశారు. ఈ నిధుల నుండే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇఓ) మొదలుకుని కమిషనర్ దాకా వేతనాలు, ఇతర అలవెన్స్‌లను చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. ఇలా ఉండగా ఆలయాల్లో పనిచేసే ఇతర సిబ్బంది, అర్చకుల వేతనాలకు గ్యారంటీ ఉండటం లేదన్నారు.
ఈ అంశాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టులో స్వామి దయానంద సరస్వతి ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో తాము కూడా భాగస్వాములం అవుతామని, తమను కూడా విచారించాలంటూ ఎపి అర్చక సమాఖ్య సుప్రీంకోర్టును కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యక్రమాలపైనే ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తోందని విమర్శించారు.