రాష్ట్రీయం

అంతర్జాతీయ నృత్యోత్సవాలకు వేదిక హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: హైదరాబాద్ మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 15 వరకు ఆసియా-పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ అంతర్జాతీయ నృత్యోత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. శిల్ప కళా వేదికలో నిర్వహించనున్న ఈ వేడుకకు చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధితశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పాపారావు, ప్రసార భారతి సభ్యుడు సురేశ్ చంద పాండ, సాంస్కృతికశాఖ కార్యదర్శి బి వెంకటేశం, సమాచారశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితదితరులతో ఏర్పాట్లపై రాజీవ్ శర్మ చర్చించారు. ప్రసార భారతి, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించబోయే ఈ వేడుకల్లో 12 దేశాల నుంచి 120 మంది కళాకారులు పాల్గొనబోతున్నారని రాజీవ్ శర్మ తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్థానిక కళాకారులు ఈ నృత్యోత్సవంలో పాల్గొనడానికి జూలై వరకు తమ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని, వీటిని ప్రసారభారతి.ఒఆర్‌జి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారని రాజీవ్ శర్మ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కళాకారులు హాజరుకానుండటంతో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆయన సూచించారు.