ఆంధ్రప్రదేశ్‌

ప్రజలతో మమేకమైతే గెలుపు మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: నిత్యం ప్రజలతో మమేకమై పనిచేసిన వారు ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారని వైకాపా అధినేత జగన్ చెప్పారు. అందుకే గడపగడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలియచేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గ ఇన్‌చార్జ్, కో-ఆర్డినేటర్ విధిగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లాలి. ప్రతి ఇంటికి వెళ్లి, వారితో కొంత సమయం గడిపి, వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలని అన్నారు. రోజుకు రెండు, మూడు పంచాయతీల్లో వైకాపా నాయకులు తిరగాలని ఆయన చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆలోచనలు, ప్రజలకు తన విజ్ఞప్తితోపాటు, చంద్రబాబు పాలనపై వంద ప్రశ్నలు ఉంటాయని జగన్ చెప్పారు. ఈ ప్రశ్నలకు ప్రజల నుంచే సమాధానాలు రాబట్టాలని ఆయన సూచించారు. ఐదు నెలల వ్యవధిలో గడపగడపకు వైకాపా కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు. చంద్రబాబుపై వేసిన ప్రశ్నలకు వచ్చే సమాధానాలు చూస్తే, ఆయనకు సున్నా మార్కులే వస్తాయని జగన్ చెప్పారు. ఆయన స్పష్టం చేశారు.
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తొమ్మిది తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాలను పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు.
* ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి, కెజి టు పిజి ఉచిత విద్య అన్నారు. ఈ హామీల్లో వేటినీ నెరవేర్చలేదు. ఆయన దగాకోరు విధానాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, స్థానిక సంస్థల అధికారాలకు గండికొట్టే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. సాగు నీరు లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం వలన రైతులు అల్లాడిపోతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి, తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా ప్రశ్నించకపోవడాన్ని నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* వైకాపా ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ చట్టపరంగా ఎమ్మెల్యేలపై, చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోపోవడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* దీక్ష చేస్తున్న ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులపట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. దీన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముద్రగడ దీక్షకురి వైకాపా పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మాన్నాన్ని ఆమోదించింది. అలాగే అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది.
* పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* భూ సేకరణ, భవన నిర్మాణాల్లో, భూ కేటాయింపుల్లో అక్రమాలను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* రెండేళ్ల పాలనలో పెరిగిపోయిన అవినీతిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* విభజన తరువాత ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధులు, రైల్వే జోన్ తీసుకురాలేకపోవడాన్ని నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
* రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయని, కాల్ మనీ పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, వైకాపా శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొంటూ, ఈ చర్యలను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
జగన్‌ను కలిసిన కాపు జెఏసి నేతలు
విజయవాడ, జూన్ 14: విజయవాడలో మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్టస్థ్రాయి విస్తృత సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కాపు జెఎసి నేతలు కలిసారు. ఆరు రోజులుగా ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలో వుండటంతో ఉద్ధృతమవుతున్న కాపు ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఇతర పార్టీలతో పాటు తమ పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, ఆశయ సాధనకు ఆశీస్సులందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జగన్‌ను కలిసినవారిలో కాపు జెఎసి కన్వీనర్ కొప్పుల వెంకట్, అంబటి సతీష్, ఎ.గాంధీ, విక్రమ్, డి.ప్రభాకర్ తదితరులున్నారు. ఇంతకుముందు గిరిజన సంఘాల జెఎసి నాయకులు జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పుష్కర తొక్కిసలాట విచారణ 21కి వాయిదా
రాజమహేంద్రవరం, జూన్ 14: ఆధారాలు పరిశీలించిన తరువాతే సంబంధిత అధికారులను విచారించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తానని జస్టిస్ సోమయాజులు స్పష్టంచేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ మంగళవారం విచారణ నిర్వహించింది. తొలుత జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను విచారించాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు వాదనలను జస్టిస్ సోమయాజులు తోసిపుచ్చారు. విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. ఆ రోజున ప్రసార మాధ్యమాల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, ఇతర ఆధారాలను సమర్పించాలని, ఆ తరువాతే కలెక్టర్ తదితరులను విచారించాలన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
లోయలో పడిన ఆర్టీసీ బస్సు : ఇద్దరి మృతి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జూన్ 14: కడప జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి కడపకు బయలుదేరిన కడప డిపో ఆర్టీసీ బస్సు మంగళవారం తెల్లవారుజామున కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి చింతకొమ్మదినె్న మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ 3వ మలుపు వద్ద అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడిపోయింది. దీంతో బస్సు కండక్టర్ రత్నయ్య(50), మరో ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ ముకుంద, 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఉద్దేశపూర్వకంగానే ఘర్షణ వైఖరి: ఉండవల్లి
రాజమహేంద్రవరం, జూన్ 14: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అరగంట సమయం చాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి ఏదో రాజకీయ లబ్ధిని ఆశించి సమస్యను జఠిలం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణ వైఖరిని అవలంభిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రి రోడ్డును 7 రేస్‌కోర్సు రోడ్డులా మార్చేసిందని ఎద్దేవా చేశారు. తుని విధ్వంసంపై నివేదిక వచ్చిన తరువాత ఆగస్టులో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి, రెండు నెలల ముందుగానే కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ వైఖరి కాపులను రెచ్చగొట్టేలా ఉందన్నారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం శోచనీయమన్నారు.
స్థాయి దిగజారి మాట్లాడొద్దు: జ్యోతుల
విజయవాడ, జూన్ 14: ‘అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉండి... రాజ్యసభ సీటు కోసం నీ ఎమ్మెల్యేలకే కోట్ల రూపాయలు ఇచ్చిన నీవా మమ్మల్ని విమర్శించేది.. స్థాయి మరచి... స్థాయి దిగజారి మాట్లాడొద్దని వైసిపి అధినేత జగన్‌పై జ్యోతుల నెహ్రూ నిప్పులు చెరిగారు నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు ఆ రోజు మీ పార్టీకి వచ్చిన వారికి అప్పుడు ఎంతిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ, స్థానిక సమీకరణల దృష్ట్యా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్న ఆశతో వైసిపిలో చేరామని, ఎనే్నళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పార్టీని విడిచిపెట్టామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రాక కోసం గడపగడపలో చీపుళ్లతో ప్రజలు రెడీగా ఉన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి వర్ల రామయ్య పేర్కొన్నారు.