ఆంధ్రప్రదేశ్‌

ఎవరినీ విడుదల చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: తుని ఘటనలో అరెస్టయిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి గంటా, హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని విడుదల చేయటానికి ప్రభుత్వం అంగీకరించిందని ముద్రగడ కుమారుడు చెప్పటంలో వాస్తవంలేదని అన్నారు. తుని ఘటనలో సమగ్ర దర్యాప్తు జరిపించటానికి మాత్రమే ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు. ముద్రగడతో దీక్ష విరమింపచేయటానికి అధికారులను అక్కడికి పంపించామని ఆయన తెలిపారు. ముద్రగడతో జరిగిన చర్చలకు ఆయన కుమారుడు చేస్తున్న ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదని గంటా స్పష్టం చేశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని బిపి 140/90 ఉందని, చక్కెర శాతం కూడా నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి ముద్రగడకు ఐదు సెలైన్ బాటిళ్లు ఎక్కించారని గంటా తెలిపారు. ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటున్నందున ముద్రగడ దీక్ష విరమించుకున్నట్లుగా బావిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ముద్రగడ దీక్ష పూర్తి స్థాయిలో విరమించాలని గంటా విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. అందుకే కిర్లంపూడిలో 144 సెక్షన్ విధించామని ఆయన తెలిపారు.