రాష్ట్రీయం

కాంట్రాక్ట్‌కు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలి దశలో 5 వేలమంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి రెండు మూడు రోజుల్లో నియామక పత్రాలను జారీ చేయాల్సిందిగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ దశలో మరో ఐదువేలమంది ఉద్యోగులను, మూడవ దశలో మూడు వేల మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని అన్ని శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. సచివాలయంలో గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో రాజీవ్ శర్మ చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన నిబంధనలకు అర్హులైన వారిగా వివిధ శాఖలనుంచి అందిన ప్రాథమిక జాబితాను రాజీవ్ శర్మ ఆమోదించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ప్రభుత్వం ఇప్పటికే తెప్పించుకుంది. వీరిలో 13 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులైన వారిగా ప్రభుత్వం వడబోసింది. వాస్తవానికి రాష్టవ్య్రాప్తంగా 80 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అయితే వీరిలో యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న వారు ఉన్నారు. రాజీవ్ శర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ అందజేసిన నివేదికలో అందరి సర్వీసులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ మెరిట్, రిజర్వేషన్ రోస్టర్, వయో పరిమితిని అనుసరించి జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని రాజీవ్ శర్మ కమిటీ సిఫారసు చేసింది. పైగా ప్రభుత్వం ట్రెజరీ నుంచి వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరణకు కొలబద్ధంగా నిర్ణయించింది.