రాష్ట్రీయం

ఆర్టీసీని మూసేద్దామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసిని నడపడం కంటే మూసివేయడం మేలు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతో కార్మికులు సమ్మెలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆర్టీసి నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు 44 శాతం ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇవేవి పట్టించుకోకుండా కార్మికులు సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకోకతప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆర్టీసిపై డిపో మేనేజర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ దాకా విస్తృతస్తాయి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరై ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహంపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ముందస్తుగా గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జెవి రమణారావు, రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానీయా, జెటిసి సత్యనారాయణతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ఆర్టీసిని గట్టేక్కించేందుకు హైదరాబాద్ బస్సులను జిహెచ్‌ఎంసికి అనుసంధానం చేశామన్నారు. ఆర్టీసిని నష్టాలోంచి కాపాడేందుకు ప్రభుత్వమే నిధులు విడుదల చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి వేతనాలు పెంచామన్నారు. అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తరుచూ సమ్మెలకు దిగడం వల్ల ఆర్టీసి మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని కార్మికులు సహకరిస్తే ఆర్టీసిని నడుపుదాం, లేదంటే ఆర్టీసిని వదులుకుందామనే ప్రతిపాదనపై సమావేశంలో చర్చకు వచ్చింది. రోజుకు 90 లక్షల మంది ఆర్టీసిలో ప్రయాణం చేస్తున్నప్పటికీ నష్టాల్లో ఉండటానికి కారణాలు ఏమిటో లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసి బస్సులను నడపటం లేదనే వాస్తవాన్ని గమనించాలని ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం ఆర్టీసీపై గురువారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్