రాష్ట్రీయం

రేపటి నుంచి భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి 20 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఎపిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తుందని, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. నైరుతీరుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, ఉత్తర కర్నాటక, మహారాష్ట్ర, మరాట్వాడా ప్రాంతాల్లో వచ్చే 2-3 రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చరణ్‌సింగ్ స్పష్టం చేశారు.