రాష్ట్రీయం

నిత్యజీవితంలో అణుఇంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: నిత్యజీవితంలో ప్రతి అంశానికీ అణుఇంధనంతో ముడిపడి ఉంటుందని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, సిఇఓ జి కళ్యాణకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఎంపి చారి 9వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ హైథరాబాద్ రీజనల్ సెంటర్ నిర్వహించింది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్ సాయిబాబా స్మారక ఉపన్యాసం ఇస్తూ సాధారణ మనిషికి సైతం ఏన్నో విషయాల్లో అణుఇంధన అభివృద్ధి వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. ఆరోగ్య రంగం, వ్యవసాయం, మందులు, నీటి కాలుష్య నివారణ, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాల్లో అణుఇంధన వినియోగం ఎంతో ఉంటుందని అన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌ను అవకాశాల కేంద్రంగా మార్చాలని కెమికల్ ఇంజనీర్స్ విభాగం అధ్యక్షుడు శ్యాం బాంగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఎ వి రామారావు పాల్గొన్నారు.