రాష్ట్రీయం

తెలియకుండా మాట్లాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: కేంద్రప్రభుత్వం ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో వివిధ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరువ చేస్తోందో తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై నిజాలను తెలుసుకోవాలని కెటిఆర్‌కు ఆయన సూచించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు. రెడియల్ కోడ్ కోసం కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. దీని కోసం 80 కోట్ల రూపాయిలు కేటాయించిన విషయం తెలుసుకోవాలని అన్నారు. రెడియల్ కోడ్‌కు సంబంధించిన డిపిఆర్‌తో ఢిల్లీకి రావాలని దత్తాత్రేయ సూచించారు. దానికి తమ మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్పారు.