రాష్ట్రీయం

ప్రతి కుటుంబానికి రూ.లక్ష బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాల్లో మార్పులు తెచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికై ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో మరిన్ని వైద్య విద్యాలయాల స్థాపనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రతీ కుటుంబానికి రూ.లక్ష బీమా కల్పిస్తామని ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా విజయవాడకు విచ్చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 30ఏళ్ల తర్వాత సమర్థుడైన నాయకుడు నరేంద్రమోదీ రూపంలో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చారన్నారు. ప్రజల ఆదరణతో నేడు దేశంలో స్థిరమైన ప్రభుత్వం, సమర్థుడైన నాయకుడు మన దేశాన్ని పాలిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రంగాల్లో మార్పులు తేవాలనేది ప్రధాని లక్ష్యంగా చెప్పారు. పనిచేయడం, సంస్కరించడం, దాని ఫలాలు అందించడం ఇవే ప్రధాని లక్ష్యాలుగా చెప్పారు. ఆ మార్పు మన కళ్లముందే కనిపిస్తోందన్నారు. ప్రజాభ్యుదయం, ఆర్థికాభివృద్ధి కోసం పనిచేస్తూ నిజాయితీ, పరిపూర్ణ వ్యక్తిత్వంతో దీటైన నాయకుడిగా ఎదిగారన్నారు. 18 నెలల్లో 10 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించిన ఘనత ఆయన సొంతమన్నారు. పలు దేశాల అత్యున్నత పౌర అవార్డులు సైతం పొందారన్నారు. ఆయా దేశాలు మోదీని గుర్తిస్తున్నారంటే దేశాన్ని గుర్తించినట్లేనని, అంటే భారతీయ జనతా పార్టీని గుర్తించినట్లుగా చెప్పారు. దేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఎన్నో సమస్యలకు మోదీ పరిష్కారం చూపారన్నారు. ఒకప్పుడు యూరి యా కోసం రైతులు రోజుల తరబడి డిపోల వద్ద వేచి ఉండేవారన్నారు. కాని నేడు ఆ పరిస్థితి లేదన్నారు. యూరియా ఉత్పత్తిని 245 మెట్రిక్ టన్నులకు పెంచడంతో పాటు రసాయన కంపెనీలకు తరలిపోయే యూరియాకు వేపపూత చేయడం ద్వారా అక్రమ రవాణాను అరికట్టారన్నారు. దేశంలో ఎలాంటి అవినీతి జరగకుండా ఉండేందుకు పేదలకు నేరుగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించిందన్నారు. మోదీ పేదల కోసం జన్‌ధన్ పథకం పేరుతో జీరో బాలెన్సుతో బ్యాంకు ఖాతాలు తెరిపించారన్నారు. 22కోట్ల ఖాతాలు దేశంలో తెరిచారని, ఇప్పుడున్న బ్యాంకు సిబ్బందే ఎలాంటి అదనపు జీతం తీసుకోకుండా ఈ ఖాతాలు తెరిచేందుకు పనిచేయడం విశేషమన్నారు. 3.50 కోట్ల బోగస్ గ్యాస్ కనెక్షన్లను తొలగించటం వల్ల రూ.14వేల కోట్ల ఆదాయం కేంద్రానికి మిగిలిందని, సభాధ్యక్షులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికై రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరపున ఎన్నికైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకై కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి రూ.1.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు వెంకయ్య కృషి చేశారని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు, ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యాంకిషోర్, మాజీ ఎమ్మెల్యేలు దారా సాంబయ్య, వెలంపల్లి శ్రీనివాసరావు, అయ్యాజీ వేమ, నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజు, జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.