రాష్ట్రీయం

తెలంగాణ పిజి ఇసెట్ ఫలితాల వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పిజి ఇసెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం ఉదయం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, కో కన్వీనర్ డాక్టర్ పి రమేష్ బాబు, కో ఆర్టినేటర్ ప్రొఫెసర్ ఎ కృష్ణయ్య పాల్గొన్నారు. 44,043 మంది అభ్యర్ధులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, 41,281 మంది హాజరయ్యారని అందులో 35,093 మంది అర్హత సాధించారని పాపిరెడ్డి చెప్పారు. పిజిసెట్ వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులను ఉంచినట్టు ఆయన చెప్పారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో 130 మంది, ఆర్కిటెక్చర్ ప్లానింగ్‌లో 251 మంది, బయోమెడికల్‌లో 43 మంది, బయోటెక్నాలజీలో 60, కెమికల్ ఇంజనీరింగ్‌లో 138 మంది, సివిల్ ఇంజనీరింగ్‌లో 138 మంది అర్హత సాధించారని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్‌లో 5465 మంది, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4262, ఎలక్ట్రికల్‌లో 5756, ఎలక్ట్రానిక్స్‌లో 7116, ఎన్విరాన్‌మెంటల్ మేనేజిమెంట్‌లో 86, ఫుడ్ టెక్నాలజీలో 46, జియో ఇంజనీరింగ్‌లో 68, ఇనుస్ట్రుమెంటేషన్‌లో 124, మెకానికల్‌లో 5384, మెటలర్జీలో 49, నానో టెక్నాలజీలో 38, ఫార్మసీలో 6068, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 9 మంది అర్హత సాధించారు.
ర్యాంకర్లు వీరే
ఏరోస్పేస్‌లో ఎం శ్రీకాంత్, ఆర్కిటెక్చర్‌లో ఎం ప్రసాద్, బయోమెడికల్‌లో ఎ వి కుమార్ గౌడ్‌లు టాపర్లుగా నిలిచారు, బయోటెక్నాలజీలో బి అక్షత, కెమికల్‌లో జి రవితేజ(విజయనగరం), సివిల్‌లో ఆర్ శ్రీనివాసరావు, కంప్యూటర్ సైన్స్‌లో మర్రి కావ్యారెడ్డి, ఎలక్ట్రికల్‌లో కె వినయ్ కుమార్, ఎలక్ట్రానిక్స్‌లో డి వినిల్‌కుమార్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజిమెంట్‌లో వై ఆదిత్యరెడ్డి, ఫుడ్ టెక్నాలజీలో ఎస్ సుమంత్‌కుమార్, జియో ఇంజనీరింగ్‌లో ఎం కిరణ్‌కుమార్, ఇనుస్ట్రుమెంటేషన్‌లో ఎం వాసుదేవ్, మెకానికల్‌లో ఎం కార్తీక్, మెటలర్జీలో వి గాయత్రీ దేవి, నానో టెక్నాలజీలో వి త్రివేది, ఫార్మసీలో బి శిరీష, టెక్స్‌టైల్ టెక్నాలజీలో సి సతీష్ టాపర్లుగా నిలిచారు.