రాష్ట్రీయం

ఆదాయం ఆశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ఆదాయ సముపార్జిత ప్రభుత్వ శాఖలు మూస ధోరణిలో కాకుండా సాంకేతికతను జోడించి శాస్ర్తియ పద్ధతిలో మరింత విశే్లషణాత్మకంగా నివేదికలను రూపొందించాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో గతంతో పోల్చినప్పుడు ఎందుకు వ్యత్యాసాలు ఉంటున్నాయో మరింత లోతుగా అధ్యయనం జరిపి సమగ్ర విశే్లషణలతో కూడిన నివేదికలు తయారుచేయాలని, దానికోసం అవసరమైతే మైక్రోసాఫ్ట్ అనలిటిక్స్ వంటి ఆధునిక విధానాలను అనుసరించాలని గురువారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులకు సూచించారు.
ప్రభుత్వానికి సమకూర్చే ఆదాయం ఎక్కువగా సేవల రంగం నుంచే వస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్సైజ్ వంటి ప్రభుత్వ శాఖకు లక్ష్యాలు నిర్దేశించటం లేదని ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోరుకుంటున్నందున ప్రజల్లో క్రమంగా ఆ అలవాటును మాన్పించటం కోసం బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మద్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేనందున ఎట్టి పరిస్థితుల్లోనూ దిగువ స్థాయి అధికారులకు, వ్యాపారులకు లక్ష్యాలు ఇవ్వద్దన్నారు. డిస్టిలరీల నుంచి స్టోరేజ్, విక్రయ కేంద్రాల వరకు మద్యం అమ్మకాల ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో తాగుడుకు పెట్టే ఖర్చు పెరగడం ఎంతమాత్రం క్షేమదాయకం కాదని అది అంతటితో ఆగకుండా ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చును కూడా పెంచుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 2016-17లో మొదటి రెండు మాసాలకు గాను గత ఏడాది కంటే 10.10 శాతం వృద్ధితో రూ.5,256.58 కోట్లుగా ఉంది. ఎక్సైజ్‌శాఖ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 48.50 శాతం వృద్ధితో రూ.432.40 కోట్లుగా ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 21.25 శాతం వృద్ధితో రూ.656.79 కోట్లు ఉంది.
అటవీశాఖ, భూగర్భ గనులశాఖలు ఈ రెండు నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడ్డాయి. ల్యాండ్ రెవెన్యూశాఖలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యం రూ.831 కోట్లు కాగా, భూగర్భ గనుల శాఖ లక్ష్యం రూ.1705 కోట్లుగా ఉంది. అన్ని శాఖలు కలిపి రూ.55,477 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించారు.
సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్ చంద్ర (సీఎంవో), అజయ్ కల్లామ్ (ఆర్థిక), శాంబాబ్ (రవాణా), ఎక్సైజ్‌శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు పాల్గొన్నారు.

చిత్రం సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు