రాష్ట్రీయం

టిటిడిలో నెక్ట్స్ జన్ వెబ్‌సైట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 16: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించేందుకు రూపొందించిన నెక్ట్స్‌జన్ వెబ్‌సైట్‌ను టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు ప్రారంభించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో గురువారం ఉదయం ఆయన ప్రయోగాత్మకంగా ఈ సైట్‌ను ప్రారంభించారు. అందులోభాగంగా ఆంధ్రాబ్యాంక్ డెబిట్ కార్డు నుంచి తన తల్లి పేర రూ.7,777 వేల రూపాయలు ఈ-హుండీకి చెల్లించి ఇ ఓ మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ ప్రఖ్యాతి గాంచిన టిసిఎస్ సంస్థ కార్పొరేట్ సేవల్లో భాగంగా టిటిడికు అంతర్జాల ఆధారిత సేవలను ( ఆన్‌లైన్ సేవలను) అందిస్తుందని తెలిపారు. టిటిడి కాల్‌సెంటర్, వెబ్‌సైట్, ఈ-మెయిల్స్ ద్వారా యాత్రికుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌తో జూలై నెలాఖరుకు పూర్తిస్థాయిలో ఈ నూతన వెబ్‌సైట్ పనిచేస్తుందని అన్నారు.