రాష్ట్రీయం

ద్వేషం... పెరిగిపోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ఎన్నికల్లో కుల, మత, ధన ప్రభావం ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నాలుగోసారి ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం హైదరాబాద్‌లో ఇమేజ్ గార్డెన్స్‌లో పార్టీలకు అతీతంగా జరిగిన ఆత్మీయ అభినందన సభలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు చేసిన సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వెంకయ్య చేసిన కృషి మరువలేనిదని సినీనటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు తెలుగువారు అయినందుకు అందరూ గర్వపడాలని అన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో వెంకయ్య తనదైన ముద్రవేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ సహా వందలాది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆత్మీయ అభినందన సభలో తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెబుతూ వెంకయ్య నాయుడు తన మనసులోని మాటల్ని వెల్లడించారు. భాజాపాలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన తాను జాతీయ స్థాయి అధ్యక్షుడిని అవుతానని ఎన్నడూ ఊహించలేదన్నారు. పార్టీ పెద్దలను పరిశీలిస్తూ అనేక విషయాలను నేర్చుకుంటూ ఉండటమే తన విజయానికి కారణమని అన్నారు. తాను అసెంబ్లీలో ఉన్న కాలమే అత్యంత సంతోషకరమైన రోజులని గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో రాజకీయ నేతలకు సహనం, ఓర్పు నశించాయని ఒకరికొకరు ద్వేషించుకునే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, ప్రమాణాలు అవసరమని, ఇరు పక్షాలు చెప్పే విషయాలు వినే ఓపిక నాయకులకు ఉండాలన్నారు. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం దారుణమన్నారు. పార్టీలు మారడం తప్పు కాకపోయినా పార్టీ మారిన మరుక్షణమే తన పదవికి రాజీనామా చేయడం సమంజసమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను చూసి ఈ మాట చెప్పడం లేదని, దేశవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉందని అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పున:సమీక్షించాల్సి ఉందని అన్నారు. పార్టీ మారగానే వారి పదవులు పోయేలా నిబంధనలు తేవాలని అన్నారు. డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలనుకోవడం సిగ్గుచేటని వెంకయ్య అన్నారు. రాజకీయాలకు విలువలు రావాలంటే మనం విలువలు పాటించాలని చెప్పారు.చాలా రాష్ట్రప్రభుత్వాలు తాత్కాలిక జనాకర్షణ పథకాలు ప్రవేశ పెడుతున్నాయని పేర్కొన్న ఆయన దీని వల్ల ఆర్ధిక భారం పెరిగి రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని అన్నారు. అర్ధవంతమైన రాజకీయాలతోనే దేశానికి భవిష్యత్ ఉంటుందని, దేశ ప్రధాని వినూత్నంగా ఆలోచిస్తున్నారని, యూరియా కొరత లేకుండా చేశారని, అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. ఇంకా కొనసాగుతున్న సామాజిక దురాచారాలను పారదోలాలన్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేసి రెండు మార్లు గెలిచానని, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నానని అన్నారు. రాజకీయాల్లో ఓపిక అవసరమని పేర్కొన్న వెంకయ్య నాయుడు ప్రజాసేవకు పదవులు అవసరం లేదన్నారు. రాజకీయాల్లో తానెన్నడూ రాజీపడలేదని అన్నారు. వాజపేయి, అద్వానీ పక్కన కూర్చుంటానని తాను అనుకోలేదని తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీకి మద్దతుగా నిలవడానికే తాను రాజ్యసభకు పోటీ చేశానని అన్నారు.
వెంకయ్యను సత్కరించిన ఎంవిఆర్ శాస్ర్తీ
ఈ సందర్భంగా ఆంధ్రభూమి సంపాదకుడు ఎంవిఆర్ శాస్ర్తీ వెంకయ్యనాయుడును అభినందించి సత్కరించారు.

చిత్రం... హైదరాబాద్‌లో ఆత్మీయ అభినందన సభలో వెంకయ్య నాయుడిని సత్కరిస్తున్న దృశ్యం