రాష్ట్రీయం

మాదే పైచేయి .. బాబు మెడలు వంచగలిగాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ముద్రగడ పద్మనాభం దీక్ష అనంతర పరిణామాల్లో చంద్రబాబు సర్కారుపై తామే పైచేయి సాధించామని కాపుప్రముఖులు అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టినవారు విడుదల కావడం ముద్రగడ సాధించిన విజయమని, ఈ క్రమంలో అగ్రనేతలంతా జాతి ప్రయోజనాల కోసం ఒక్కతాటిపైకి రావడం శుభసంకేతమని శుక్రవారం కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు నివాసంలో జరిగిన కాపు ప్రముఖుల భేటీలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ముద్రగడ దీక్ష, అనంతర పరిణామాలపై పల్లంరాజు నివాసంలో జరిగిన సమీక్ష సమావేశానికి దాసరి, చిరంజీవి, బొత్స, అంబటి రాంబాబు,సి.రామచంద్రయ్య, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడు, కఠారి అప్పారావు, దిలీప్, తోట చంద్రశేఖర్, గంగాభవాని, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. ముద్రగడ దీక్ష వ్యవహారం కాపులలో మరోసారి చైతన్యస్ఫూర్తి కనిపించిందని, ఆయనకు అండగా తాముంటామన్న సంకేతాలు పంపడంలో నైతిక విజయం సాధించామని నేతలు విశే్లషించారు. దీక్ష సందర్భంగా కాపు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్, చినరాజప్ప, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఇతర టిడిపి కాపు నేతలు అవమానకర రీతిలో మాట్లాడారని నిందితులను వదిలిపెట్టమని, కేసులు కొనసాగుతాయని, ముద్రగడ దీక్ష విరమించారని చెప్పడం కాపులను అవమానించడమేనని, చంద్రబాబు వారి వెనుక ఉండి ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ విషయంలో ముఖ్యమంత్రి, కాపుమంత్రులు భిన్నంగా మాట్లాడి, ముద్రగడ ఆరోగ్యాన్ని ఆందోళనకర స్థితికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. పదిమందికి బెయిల్ రావడంతో బాబు మెడలు వంచగలిగే స్థాయికి వచ్చామన్నారు.
ముద్రగడకు, ఆయనకు మద్దతుగా మాట్లాడిన తమపై కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడిన తీరుపై క్షేత్రస్థాయిలో కాపులు కూడా ఆగ్రహంతోఉన్నారు. పోలీసులు ముద్రగడ కోడలి విషయంలో దారుణంగా వ్యవహరించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి కూడా బాగోలేదని వివరించారు. దీక్ష సమయంలో పోలీసులు, ప్రభుత్వం కాపుల పట్ల అమానీయం, హేయంగా ప్రవర్తించిందని, దీనిని కాపులు మర్చిపోరని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాపుల పట్ల పోలీసుల ప్రవర్తన తీరు కాపుల్లోకి వెళ్లిందన్నారు.
నిందితులకు బెయిల్ రావడం కాపులు సాధించిన తిరుగులేని విజయమని అభివర్ణించారు. ఈ పోరాటంలో పాల్గొన్న కాపులతోపాటు, తమతోపాటు అండగా నిలిచిన మిగిలిన వర్గాలకూ కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మిగిలిన ముగ్గురికి సోమవారం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నందున, ముద్రగడ దీక్ష కూడా సోమవారమే ముగిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మనమంతా అక్కడికి వెళ్లాలనుకున్నా, పరిస్థితిని ఇంకా విషమం చేయడం ఇష్టలేకనే విరమించుకున్నాం. మనమంతా ముద్రగడ వెనుక ఉన్నామన్న సంకేతాలివ్వడంతో ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ఇకపై కూడా మనం ఇదే స్ఫూర్తితో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటనతో కాపులు ప్రభుత్వానికి మెజారిటీ శాతం దూరమయ్యారని నేతలు విశే్లషించారు.

మంత్రుల విమర్శల వెనుక బాబు: దాసరి
ముద్రగడ, కాపుజాతి నిజాయితీని అవమానించేలా మాట్లాడిన కాపు మంత్రుల విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. వారేమి మాట్లాడినా చంద్రబాబుదే బాధ్యత అని, ముద్రగడ ప్రాణాలతో వీళ్లంతా చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బాబు చెబుతారు.కానీ మంత్రులే లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. మేం సీరియస్ అంశంపై భేటీ అయితే, కొన్ని చానళ్లు కనీసం అర నిమిషం కూడా చూపలేదు. వాళ్ల బాధలేంటో నాకు తెలుసు. దీక్ష విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం’ అని దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు సర్కారు వైఖరిని తూర్పారపట్టారు. ‘కలెక్టర్, ఎస్పీలు వచ్చి హమీలు నెరవేరుస్తామని చెబితేనే ముద్రగడ ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారు. కానీ హోం మంత్రి ఆయన దీక్ష విరమించారని, ఆరురోజులు దీక్ష చేస్తే ఆరోగ్యంగా ఎలా ఉంటారని వెటకారంగా మాట్లాడటం ఆయన నిజాయితీని, జాతి నిజాయితీని అవమానించడమే. బాబే మంత్రులతో మాట్లాడిస్తున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా అవసరమైతే రాజమండ్రికి వెళతామన్నారు. ఆయనకు మరింత మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

చిత్రం... హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు నివాసంలో శుక్రవారం సమావేశమైన కాపు నేతలు
చిరంజీవి, దాసరి, సి రామచంద్రయ్య తదితరులు