రాష్ట్రీయం

లెండిపై ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల విషయంలో సహకరిస్తున్న మహారాష్ట్ర, తాజాగా లెండి ప్రాజెక్టులోనూ ఇలాంటి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు జలసౌధలో సమావేశమయ్యారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండిని త్వరితగతిని పూర్తి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జలసౌధలో సుదీర్ఘంగా సాగింది. సమావేశంలో మహారాష్ట్ర సిఇ బిడి తోండే, తెలంగాణ సిఇ ఆర్ మధుసూధన్‌రావులతో పాటు ఇరు రాష్ట్రా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లెండి ప్రాజెక్టు ఏళ్ల తరబడి కొనసాగుతోందని, దీనివల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని తెలంగాణ అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నందున మహారాష్ట్ర సహకరించాలని కోరారు. ముంపు గ్రామాల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని మహారాష్ట్ర అధికారులను కోరారు. 2017 జూన్ నాటికి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో నిజామాబాద్ పర్యటనలో ఉన్న నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర సిఇతో ఫోన్‌లో మాట్లాడారు. లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరారు. 2017 జూన్ నాటికి అన్ని సమస్యలు అధిగమించి ప్రాజెక్టు పూర్తిచేయాలని కోరారు. అధికారులతో సమన్వయ సమావేశం, మంత్రితో చర్చల తరువాత జూన్ 2017 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మహారాష్ట్ర అధికారులు అంగీకరించారు. తొలిదశ రిజర్వాయర్‌ను జూన్ 2018 నాటికి పూర్తి చేసి క్రెస్ట్ వరకు నీళ్లు నిల్వ చేసేందుకు మహారాష్ట్ర అధికారులు అంగీకరించారు. 2018 చివరి నాటికి మొత్తం భూసేకరణ అర్ అండ్ ఆర్ పనులు (ఐదు గ్రామాల్లో) పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
లెండి ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర సైతం సానుకూలత వ్యక్తం చేయడంతో మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 17న మహారాష్టల్రో జరిగిన సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తెలంగాణ సిఎం కెసిఆర్‌లు సమావేశమై లెండి ప్రాజెక్టు పనులపై చర్చించారు. లెండికి సంబంధించి కేంద్ర జల సంఘంలో అనుమతులు తీసుకోవడం, అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంపై చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 183.73 కోట్లు మహారాష్టక్రు చెల్లించింది. జాప్యంవల్ల పెరిగిన అంచనా వ్యయం చెల్లించేందుకూ సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం నాటి సమన్వయ కమిటీ సమావేశం తరువాత ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతాయని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.