రాష్ట్రీయం

కొత్త టెక్నాలజీని అధ్యయనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: రక్షణ రంగంలో కొత్త టెక్నాలజీ విధానాలను సైన్యాధికారులు అధ్యయనం చేయాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి కోరారు. శనివారం ఇక్కడ ఎంసిఇఎంఇ సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఆయన 25 మంది సాంకేతిక ఎంట్రీ స్కీం అధికారులకు ఇంజనీరింగ్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలన్నారు. నిరంతర అధ్యయనం వల్ల వ్యూహాత్మక విధానాలను అమలు చేసే అవకాశాలు లభిస్తాయన్నారు. మేజర్ జనరల్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి నిత్య అధ్యయన శీలి అని, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడంలో ఆదర్శంగా తీసుకోవాలని ఆర్మీ అధికారులను కోరారు. 1946లో నెలకొల్పిన మిలిటరీ కాలేజీ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుందన్నారు. జెఎన్‌టియు, జెఎన్‌యు వర్శిటీలు ఈ సంస్థలో చదివిన విద్యార్థులకు ఎంటెక్, బిటెక్ డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయన్నారు. లెఫ్టినెంట్ జనరల్ గురుముఖ్ సింగ్ మాట్లాడుతూ ఎంసిఇఎంఇ సాధించిన విజయాలను వివరించారు. ప్రతిభ కనపరచిన ఆర్మీ అధికారులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.

చిత్రం ఎంసిఇఎంఇలో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో
రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి