రాష్ట్రీయం

సూర్యప్రభ వాహనంపైనుంచి వేద నారాయణుడి అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 14: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్య ప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయం ప్రసాదించారు. నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణ శోభిత ఆభరణాలతో అలంకరించి సూర్య ప్రభవాహనంపై అధిష్టింపచేశారు. భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. కాగా సోమవారం రాత్రి పద్మావతీ అమ్మవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నవనీత చోరునిగా దర్శనమిచ్చారు.
చిత్రం... కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు