రాష్ట్రీయం

అప్పుల కన్నా ఎఫ్‌డిఐలు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: దేశంలో పేరుకుపోతున్న అప్పుల కన్నా ఎఫ్‌డిఐలు మేలని, కేంద్రం ప్రత్యక్ష పెట్టుబడులపై ఆలస్యంగానైనా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, జాతీయ నేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ అన్నారు. ఎఫ్‌డిఐలతోపాటు స్వదేశీ పెట్టుబడులను, ముఖ్యంగా ఎస్‌ఎంఇలలో కూడా ప్రోత్సహించాలని, స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా పెట్టుబడులను ఆకర్షించాలని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సూచించారు. అప్పుల కన్నా ఎఫ్‌డిఐలు మేలని, అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన జన్మహక్కేమీ కాదని జెపి అన్నారు. ఎఫ్‌డిఐలపై రాజకీయ పార్టీలు పైకి ఒక విధంగా, అంతర్గత సమావేశాల్లో మరో రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించాయని, ఇలాంటి అవకాశవాదం, ప్రతికూల రాజకీయ వాతావరణం వల్ల వ్యవసాయం, ఉపాధి నష్టపోయాయని జెపి పేర్కొన్నారు. దళారులు లేని రిటైల్ చైన్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటై ఉంటే రైతులకు, వినియోగదారులకు కూడా లాభం చేకూరి ఉండేదన్నారు.పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కనిపంచడాన్ని నిరంతరం కార్యక్రమంలా కొనసాగించాలని, 2022 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ లక్ష్యం కావాలని జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు.