రాష్ట్రీయం

ఏ బ్రాంచి అనేది కాదు.. కౌశలం, నైపుణ్యం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఏ బ్రాంచి అన్నది కంటే అభ్యర్ధుల కౌశలం, నైపుణ్యం, ఆసక్తి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 22 నుండి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌనె్సలింగ్ జరగనున్న నేపథ్యంలో విద్యార్ధులు ఏ బ్రాంచిలో చేరాలనే మీమాంసపై నిపుణులు డిమాండ్ బ్రాంచి అనే ఆలోచన కంటే వ్యక్తిగత సామర్ధ్యాలను, నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరో స్పేస్ , సివిల్, బయోమెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ , ఇండస్ట్రియల్, మెకట్రానిక్స్, పెట్రోలియం, టెక్స్‌టైల్, మెరైన్, మెటలర్జికల్, మైనింగ్, కెమికల్ ఇలా దాదాపు 40 వరకూ బ్రాంచిలు ఉన్నా అందులో 31 వరకూ వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏరోస్పేస్‌లపై ఎక్కువ మంది దృష్టిపడింది. ఉన్నవాటిలో బయోటెక్నాలజీ, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్, ఫార్మస్యుటికల్, ప్రింటింగ్, ఆటొమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచిలు లేదా అనుబంధ సబ్జెక్టులపై విద్యార్ధులకు ఆసక్తి తగ్గింది.
వాస్తవానికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు ఎంత గిరాకీ ఉందో అంతే గిరాకీ ఆటోమెబైల్ ఇంజనీరింగ్‌కు సైతం ఉందని అయితే వ్యక్తిగతంగా తమకు ఉన్న ఆలోచనలు, సన్నద్ధత, తెలివితేటలు, విద్య కొనసాగించగలిగే సామర్ధ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఐఐటి శిక్షణా నిపుణుడు చుక్కారామయ్య పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చినపుడు అందరూ ఇస్తున్నారని ఒక బ్రాంచిని ఎంచుకునే కంటే తనకు వ్యక్తిగతంగా ఏ బ్రాంచి ఇష్టమో తేల్చుకోవాలని ప్రొఫెసర్ రామచంద్రన్ పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చినపుడు ప్రాధాన్యత బ్రాంచి విషయంలో ముందుగా చర్చించుకోవాలని ఎమ్సెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు చెప్పారు.