రాష్ట్రీయం

చైనాకు బాబు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సహా 13 మందితో కూడిన జంబో బృందం ఈ నెల 26 నుండి చైనాలో పర్యటించనుంది. ఇందుకు షెడ్యూలును, చంద్రబాబు వెంట వెళ్లే అధికారుల జాబితాను మంగళవారం ఖరారు చేశారు. ప్రధానంగా వౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణం, రోడ్లు, ట్రాఫిక్ , వ్యర్థ పదార్థాల యాజమాన్య పద్ధతులు పరిశీలించడంతో పాటు పారిశ్రామికవేత్తలతోనూ ఈ బృందం సమావేశం అవుతుంది. 10వ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ న్యూ ఛాంపియన్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. చైనా స్థానిక నేతలతో సమావేశమై అమరావతి నిర్మాణంలో సహకరించమని కోరనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వాణిజ్య వేత్తలతో, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే నేతలతో కూడా ఈ బృందం సమావేశం అవుతుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఉత్తమ ఆర్కిటెక్చర్ ఉన్న భవనాలను కూడా చూస్తుంది. ఈ బృందం తిరిగి జూలై 1న విజయవాడకు వస్తుంది. చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, సలహాదారుడు పరకాల ప్రభాకర్, డెవలప్‌మెంట్ కమిషనర్ పెనుమాక వెంకట రమేష్ బాబు, ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, వౌలిక సదుపాయాల కల్పన ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోలమన్ అరోకియా రాజ్, ఐటిఇ అండ్ సి కార్యదర్శి ప్రద్యుమ్న, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి లక్ష్మీ పార్థసారధి, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ జాస్తి కృష్ణకిశోర్, సిఎం పిఎ బత్తినేని రాజగోపాల్, చీఫ్ సెక్యూరిటీ అధికారి ముద్రగడ నాగేంద్ర రావు వెళ్తారు.
ఈ సమయంలోనా?
జూన్ 27 నుండి అమరావతి, వెలగపూడిలో రాష్ట్ర పరిపాలన కొనసాగాల్సిందేనని ఏడాది కాలంగా గట్టిగా చెప్పడమే గాక, ఉద్యోగులు తరలి రావల్సిందేనని బల్లగుద్ది మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తీరా ఉద్యోగులు అమరావతి వచ్చేందుకు సిద్ధపడుతున్న సమయంలో చంద్రబాబునాయుడుతో పాటు భవనాల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించిన మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ కూడా ఆ సమయంలో చైనాలో ఉంటారు. ఉద్యోగుల కోసం ఆగమేఘాల మీద ఒక రైలు కూడా ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు. ఇప్పట్లో భవనాలు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం, ఉద్యోగులు వచ్చినా వారికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించే వాతావరణం కూడా లేని పరిస్థితుల్లో సిఎం బృందం చైనా పర్యటన పెట్టుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలే విమర్శిస్తున్నారు.
24న మంత్రివర్గ సమావేశం
కాగా ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశం తర్వాత సిఎం తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో కూడా పాల్గొంటారు. రాజధానిలో ఏర్పాటు చేస్తున్న విద్యా వైద్య సంస్థలకు భూ కేటాయింపులు అంశం ప్రధానంగా చర్చకు రానుంది. అదే విధంగా ముద్రగడ దీక్ష, తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. అదే రోజు సాయంత్రం చంద్రబాబు గుంటూరులో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.