రాష్ట్రీయం

దీక్ష విరమణలో ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 21: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణలో ప్రతిష్టంభన తలెత్తింది. దీక్ష విరమించే క్రమంలో ప్రభుత్వం వ్యహరించిన తీరుతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దీక్ష కొనసాగుతున్న సమయంలో నిత్యం చర్చలకు, పరిస్థితి సమీక్షకు ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్, ఎస్పీ దీక్ష విరమణ సమయానికి రాకపోవడంతో సమస్య మొదటికొచ్చినట్టయింది. దీక్షకు దిగిన తనను కిర్లంపూడి నుంచి ఈ నెల తొమ్మిదో తేదీన తీసుకొచ్చిన ఎస్పీ వాహనంలోనే తిరిగి కిర్లంపూడి తీసుకెళ్ళాలని ముద్రగడ పద్మనాభం తొలుత డిమాండ్ చేశారు. ఇది దీక్ష విరమణకు కలెక్టర్, జెఎసి నేతల ఆధ్వర్యంలో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీయే అయినప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరించడంతో దీక్ష విరమణ సమస్య జటిలంగా మారుతోంది. చివరకు, రాత్రి పొద్దుపోయాక కాపు జాక్ నేతలు జోక్యం చేసుకుని ముద్రగడతో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు జాక్ నేతలతో కలసి ముద్రగడ కిర్లంపూడికి వెడతారు. తదుపరి కార్యాచరణను ఆయన అక్కడే ప్రకటిస్తారని కాపు నేతలు మీడియాకు వెల్లడించారు. దీంతో దీక్ష విరమణపై సస్పెన్స్ కొనసాగుతోంది.
మరోవైపు మంగళవారం ఉదయం నుంచీ హైడ్రామా కొనసాగింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కాపు ఉద్యమ నాయకులు, ముద్రగడ ప్రధాన అనుచరులు ఆకుల రామకృష్ట, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ముద్రగడను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సెంట్రల్ జైలు బయట నిరసన కొనసాగించారు.
వ్యవహారం సుఖాంతం కానుందని మంగళవారం ఉదయం నుంచే అంతా ఎదురుచూస్తుండగా చివరి నిమిషంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అలుముకుంటున్నాయి. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి వరకు జాతీయ రహదారి వెంట భారీ పోలీసు బలగాలను మోహరించారు.

చిత్రం ముద్రగడ అనుచరులను అడ్డుకుంటున్న పోలీసులు