రాష్ట్రీయం

సీబీఐకి అగ్రిగోల్డ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణ బుధవారం హైకోర్టులో జరిగింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్‌లే, జస్టిస్ ఎస్‌బి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కేసును సిబిఐకి అప్పగించి, దర్యాప్తు జరిపించినా, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం మాత్రం హైకోర్టు నియమించిన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించిందని చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి విచారణ ఎంతవరకు వచ్చిందని ఏపి అడ్వకేట్ జననరల్‌ను ప్రశ్నించింది. సిబిఐకి అప్పగించడం వల్ల కేసు దర్యాప్తుజాప్యం జరుగుతుందేమోనని, ఇప్పటికే డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపులో ఆలస్యమయిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయినప్పటికీ సిబిఐకి కేసు అప్పగించేందుకు ఏపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుని సిబిఐకి కేసును అప్పగించే విషయమై లిఖితపూర్వకంగా పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును సిబిఐకు అప్పగించడంపై అభిప్రాయం తెలియచేయాల్సిందిగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తాము ఆదేశించినట్లుగా రూ.25 లక్షలను కోర్టు నియమించిన కమిటీ వద్ద డిపాజిట్ చేశారా అని అగ్రిగోల్డ్ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కంపెనీ షేర్లను డిపాజిటర్లకు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ సంస్థ సరైన సమాచారాన్ని కోర్టుకు ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇస్తోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.