ఆంధ్రప్రదేశ్‌

దూసుకెళ్లిన ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ సూళ్లూరుపేట, జూన్ 22: రోదసీ పరిశోధనలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇస్రో జేజేలు అందుకుంటోంది. ఒకే రాకెట్ ద్వారా ఏకంగా 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపి మన శాస్తవ్రేత్తలు సత్తా చాటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 34 మరోసారి విజయబావుటా ఎగురవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయోగించిన కార్టోశాట్-2సి ఉపగ్రహంతో పాటు మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉపగ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉపగ్రహాలను పిస్‌ఎల్‌వి వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. దీంతో భారత్ అధిక ఉపగ్రహాలు ప్రయోగించిన మూడు దేశాల్లో మూడోస్థానం సంపాదించడమే కాకుండా ఇస్రో శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్)లోని సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 48 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత బుధవారం ఉదయం 9:26 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వరుసగా 35వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 34 20 ఉపగ్రహాలను 26:30 నిమిషాలకు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 34 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కార్టోశాట్-2సి ఉపగ్రహం మరో 19 ఉపగ్రహాలను భూమి నుండి 505 కిలోమీటర్ల దూరంలో భూమధ్య రేఖకు ఏటవాలుగా 97.5 డిగ్రీల కోణంలో సూర్యనువర్తమాన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు అమెరికా 2013లో 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 33 ఉపగ్రహాలను పంపించారు. దాని తరువాత మన దేశం మూడో స్థానంలో 20 ఉపగ్రహాలను పంపిన దేశంగా పేరొందింది. వీటిలో ప్రధానమైన కార్టోశాట్-2సి దీని బరువు 727.7 కిలోలు కాగా మొత్తం 20 ఉపగ్రహాల బరువు 1288 కిలోలు. గూగుల్‌కు చెందిన 110 కిలోల బరువు కలిగిన స్కైశాట్ కూడా వీటిలో ఉంది. పిఎస్‌ఎల్‌వి మూడు దశలను సునాయాసంగా పూర్తిచేసిన అనంతరం నాలుగో దశ స్విచ్ ఆఫ్ చేసి రాకెట్‌ను మళ్లీ రీస్టాట్ చేసి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు. ఈ ప్రయోగంలో శాస్తవ్రేత్తలు నాలుగో దశ రీస్టాట్ చేసేందుకు ప్రయోగాత్మకంగా పరిశోధన చేసి విజయం సాధించారు. దీనిద్వారా ఒక కక్ష్యలోకి కాకుండా ఉపగ్రహాలను వివిధ మార్గాల్లో సులువుగా చేర్చవచ్చు. అంతేకాకుండా రాకెట్ సామర్ధ్యాన్నిబట్టి ఒకేసారి 20 నుండి 40 ఉపగ్రహాలను వివిధ మార్గాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చును. ఇంతకుముందు ఇలాంటి నాలుగో దశలో రీస్టాట్ పరీక్షలు 2015లో పిఎస్‌ఎల్‌వి-సి 29 ప్రయోగంలో కూడా చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్ కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినంతరం పిఎస్‌ఎల్‌వి-సి 34 విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఎంసిసి నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ ఒకే రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలు పంపి విజయం సాధించిన ఘనత కొత్త రికార్డు ఇస్రోకు దక్కిందన్నారు. ఈ విజయం శాస్తవ్రేత్తల సమష్టి కృషి భవిష్యత్‌లో ఒకే రాకెట్ ద్వారా మరిన్ని ఉపగ్రహాలు పంపేందుకు ఇది తొలిమెట్టులాంటిదన్నారు. కార్టోశాట్-2సి ఉపగ్రహాన్ని రూపొందించేందుకు రూ.350 కోట్లు ఖర్చు చేశారు. ఇది 5 సంవత్సరాల పాటు సేవలు అందించనున్నట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువు 44.4 మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ తన నాలుగు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొని భూమికి 505 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాలను 26:30 నిమిషాలకు కక్ష్యలో భూమధ్యరేఖా తలానికి 97.5 డిగ్రీల వాలుతో కక్ష్యలోకి శాస్తవ్రేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. మిషన్ కంట్రోలర్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న శాస్తవ్రేత్తలు రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరిన తరువాత రాకెట్ నాలుగు దశలను ఒకదాని తరువాత ఒకటి నిర్ధేశించిన సమయానికే తన నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుండి ఉపగ్రహం విడిపోయి కక్ష్యలోకి దూసుకెళ్లాయి. అక్కడే రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనిస్తున్న రేంజ్ ఆపరేషన్ వారు రాకెట్ నాలుగో దశ పూర్తిచేసినట్లు నిర్ధారించడంతో శాస్తవ్రేత్తల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది.
రాకెట్ దశలవారీగా విడిపోయింది ఇలా..
రాకెట్ భూభాగం నుంచి నింగిలోకి ఎగిరిన అనంతరం తన అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. కౌంట్‌డౌన్ పూర్తయిన తర్వాత రాకెట్ భూమి నుండి నిప్పులు చిమ్ముకుంటూ నింగి వైపు కదిలింది. తన మొదటి దశ 451 కిలోమీటర్ల వేగంతో 1:49 నిమిషాలకు 65 కిమీ ఎత్తుకు చేర్చి తొలి దశ మోటారు రాకెట్ నుంచి విడిపోయింది. రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 2170 కిలోమీటర్ల వేగంతో 4:22 నిమిషాలకు 216 కిమీ ఎత్తుకు చేరినంతరం రెండో దశ మోటారు విడిపోయింది. అక్కడ నుంచి మూడో దశ 5935 కిలోమీటర్ల వేగంతో 8:17 నిమిషాలకు 417 కిమీ ఎత్తుకు చేరినంతరం నాలుగో దశ ప్రారంభమై 7606 మీటర్ల వేగంతో 16:30 నిమిషాలకు 514 మీటర్ల ఎత్తుకు రాకెట్ చేరినంతర స్విచ్ ఆఫ్ చేసి రీస్టాట్ చేశారు. అక్కడ నుండి రాకెట్ మొదట కార్టోశాట్-2సి ఉపగ్రహాన్ని 17:7 నిమిషాలకు విడిచిపెట్టింది. అనంతరం 17:42 నిమిషాలకు సత్యభామ శాట్, స్వయంశాట్ ఉపగ్రహాలు విడిపోయాయి. అనంతరం వరుసగా విదేశీ ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒకటి విజయవంతంగా 26:30 నిమిషాలకు విజయవంతంగా కక్ష్యలోకి చేరాయి.