రాష్ట్రీయం

పులిచింతలపై పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం సమసిపోక ముందే కొత్త సమస్య వచ్చిపడింది. సహాయ పునరావాస చర్యలు పూర్తయ్యేంత వరకూ పులిచింతల ప్రాజెక్టు నింపవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది. ఆంధ్రలో నిర్మించే పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణలో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ముంపు గ్రామాలకు ఇంకా సహాయ పునరావాస చర్యలు పూర్తి చేయలేదు. సహాయ పునరావాస పనులు నత్తనడక నడుస్తున్నాయి. ముంపు బాధితు ల్లో మెజారిటీ ప్రజలు నల్లగొండ జిల్లావాసులు. 45 టిఎంసి నీటి సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనివల్ల 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెల్లటూరు, కిష్టాపురం, చింతరియాల, నెమలిపురి, రెబల్లె, శోభనాద్రపురం, సుల్తాన్‌పూర్ తండా, మట్టపల్లి, గుండ్లపల్లి, గుండెబోయిన గూడెం, తమ్మవరం, పీక్లానాయక్ తండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో సహాయ పునరావాస పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సహాయ పునరావాస కార్యక్రమాలకు 115 కోట్లు విడుదల చేయాలంటూ గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు లేఖ రాసింది. ఈ లేఖకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ అధికారులు అంటున్నారు. డాక్టర్ కెఎల్ రావు సాగర్ ప్రాజెక్టు పులిచింతల సహాయ పునరావాస పనులు పూర్తికానంత వరకు ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నీటిని నింపవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలోని ఎత్తి పోతల పథకాలను సురక్షిత ప్రదేశాలకు తరలించేంత వరకూ పులిచింతలను ఈ ఏడాది పూర్తి సామర్థ్యంతో నీటిని నింపడానికి అనుమతించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.