రాష్ట్రీయం

9నెలల్లో రాజధానికి రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: కళ్లముందే ఊహించని మార్పులు జరుగుతున్నాయని, సంక్షోభంలో అవకాశాలను వెతుక్కుంటూ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ను నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తొమ్మిది నెలల్లో రాజధానికి రహదారుల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. శనివారం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీడ్ క్యాపిటల్ రహదారి నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణం జరిగే తీరును పటం ద్వారా పరిశీలించారు. రహదారి నిర్మాణం గురించి అధికారులను, ఎన్‌సిసి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రహదారి నిర్మాణాన్ని రాత్రి పగలూ పనిచేసి 9 మాసాలలో పూర్తిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సుమారు 18 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి నెం.5కు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. రహదారి నిర్మాణానికి 200 కోట్లు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమమైన నాణ్యతతో కూడిన రహదారిని నిర్మించాలని అధికారులను, కంపెనీ ప్రతినిధులను ఆదేశించినట్లు చెప్పారు. అయితే రహదారి నిర్మాణంలో గ్రామస్థుల సహకారం చాలా అవసరమని, గ్రామస్థులందరూ తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అధ్యక్షుడు వై శ్రీనివాస శేష సాయిబాబు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.