రాష్ట్రీయం

కాల్‌మనీ పేరుతో వేధిస్తే పిడి యాక్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: కాల్‌మనీ పేరుతో వేధిస్తే పిడి చట్టం ప్రయోగిస్తామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు హెచ్చరించారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని, కేసు విచారణపై అపోహలు వద్దని స్పష్టం చేశారు. ఈకేసుకు సంబంధించి వస్తున్న రాజకీయ ఊహాగానాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక నగర పోలీసు కమిషనర్, అదనపు డిజిపి దామోదర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ బదిలీ అయ్యారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. అయినా అంతకన్నా సమర్ధవంతమైన అధికారి నియమితులయ్యారు కదా అని ఇన్‌ఛార్జి సీపి సురేంద్రబాబునుద్ధేశించి వ్యాఖ్యానించారు. నగరంలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిజిపి మాట్లాడారు. కాల్‌మనీ పేరుతో మహిళల పట్ల అక్రమార్కుల లైంగిక ఆకృత్యాల కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే ఏడుగురు నిందితులపై కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుడు యలమంచిలి రాముతోపాటు, మరో వ్యక్తి దూడల రాజేష్‌లను అరెస్టు చేయడం జరిగిందని, ఇక పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితులైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీను, ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, బాడీబిల్డర్ భవానీశంకర్, అదేవిధంగా వెనిగళ్ళ శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్‌లను అరెస్టు చేయాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ ముఠా వెనుక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులున్నారనే ఊహాగానాలు వద్దని, విచారణలో తేలితే ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని, బాధితులు అభద్రతాభావానికి గురి కావద్దన్నారు. కాల్‌మనీ వ్యాపారులు బాధితులను బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తే పిడియాక్టుతోపాటు నిర్భయ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఇక కాల్‌మనీ విషయానికొస్తే ధర్మవడ్డీకి అప్పులు ఇవ్వడం తప్పేమి కాదని, కాని దీన్ని అడ్డుపెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడటం సహించలేని నేరమన్నారు.

నేరాల అదుపునకు టెక్నాలజీ

హైదరాబాద్, డిసెంబర్ 15: జంటనగరాల పోలీసు కమిషనరేట్‌లలో నేరాల అదుపునకు కొత్త గా ప్రవేశపెట్టిన టెక్నాలజీని వినియోగించుకోవాల ని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టంను ఆయన ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) సౌజన్యంతో ఏర్పాటైన ఈ విధానం ద్వారా నేరాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం సులువవుతుంది. హోంగార్డు మొదలుకొని బ్లూకోర్టు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు, నేరస్తుల విచారణ వంటి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించవచ్చని డిజిపి అన్నారు. నగరంలో 145 లాఅండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లు, 17 సబ్ డివిజనల్ పోలీసు స్టేషన్లు, 5 జోనల్ డిసిపిలతోపాటు టాస్క్ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు, సెక్యూరింగ్, క్రైమ్ విభాగం పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేశామని డిజిపి తెలిపారు.

మంగళవారం కమిషనర్ కార్యాలయంలో
వీడియో కాన్ఫరెన్స్ సిస్టంను ప్రారంభించి ప్రసంగిస్తున్న డిజిపి అనురాగ్‌శర్మ