రాష్ట్రీయం

నెల రోజులే గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తుల కోసం తలపెట్టిన ఏర్పాట్లు ఈ నెలాఖరులోగా పూర్తికావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. ఆరు నెలలు ముందే పనులు ప్రారంభించినా పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వర్షాలతో ఆటంకం రాక ముందే పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నాణ్యత దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలని, అవసరం లేనిచోట రోడ్ల నిర్మాణాన్ని పుష్కరాల తరువాత పూర్తి చేయాలని చెప్పారు. రహదారుల విస్తరణ కోసం ఆలయాలను తొలగించాల్సి వస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని చెప్పారు. శాస్త్రోక్తంగా మరో చోటుకి విగ్రహాలను తరలించాలన్నారు. విద్యుత్ స్తంభాల నిర్మాణం, రోడ్డు నిర్మాణ పనులతో సమాంతరంగా సాగాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదానంతోపాటు, వసతి కల్పించడం కోసం సత్యసాయి ట్రస్ట్, టిటిడి, రోటరీ క్లబ్‌లు స్వచ్ఛంద సంస్థలు, అక్షయపాత్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహా స్థానికులను ప్రోత్సహించాలని చెప్పారు. విజయవాడ, గుంటూరులో వీధి దీపాలకు ఎల్‌ఈడి బల్బులను అమర్చాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆగస్ట్ 1 నాటికి పుష్కర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకురావాలని తెలిపారు. కృష్ణాతీరం పేరుతో సావనీర్ ప్రచురిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
పుష్కరాలు నిర్వహించే ప్రాంతంలో మొత్తం మూడుచోట్ల ఫుడ్ ఫెస్టివల్, రెండుచోట్ల లేజర్ షో ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే వాహనాలకు 139 ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్‌లను గుర్తించినట్టు అధికారులు వివరించారు. పుష్కరాల సమయంలో రోజుకు కనీసం లక్ష మంది అయినా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా పవిత్ర సంగమం దగ్గర దుర్గగుడి నమూనా ఆలయం సైతం ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖులను, పీఠాధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు.

చిత్రం.. పుష్కరాల పనులపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు