రాష్ట్రీయం

ఇంటింటికీ మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: హరితహారంలో గ్రామ పంచాయితీలు కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేలా చూడాలని పంచాయితీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఖాళీ స్థలాలు, అక్కడ పెట్టాల్సిన మొక్కలపై పంచాయితీ సెక్రటరీల ద్వారా వివరాలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికెళ్లి ఏ మొక్క కావాలో వివరాలు సేకరించాలని, ప్రజలు కోరిన మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లో మొక్కలను ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. గ్రామంలోనాటిన ప్రతి మొక్కకు సంబంధించిన రిజిస్టర్ నిర్వహించాలని చెప్పారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు మొక్కలను కేటాయించి, వాటి నిర్వహణ చేపట్టేలా చూడాలన్నారు. పంచాయితీ పరిధిలోని పాఠశాల్లో మొక్కలు పెంచాలని, పంచాయితీ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని చెప్పారు. గ్రామ పరిధిలో దాదాపు 20మంది ఉద్యోగులు ఉంటారని, మొక్కలు నాటడం వీరందరి బాధ్యతన్నారు. గ్రామంలోని ప్రతి దుకాణం నిర్వాహకుడు ఒక చెట్టును దత్తత తీసుకునేలా చూడాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు దత్తత ఇవ్వాలని సూచించారు. గ్రామంలో అధిక మొత్తంలో మొక్కలుపెంచిన వారికి వృక్ష మిత్ర హరితహారం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లా పంచాయితీ అధికారులు హరితహారం కోసం తప్పని సరిగా గ్రామాల్లో పర్యటించాలని మంత్రి సూచించారు. హరితహారం కోసం మంత్రి జూపల్లి శనివారం నిర్వహించిన సమావేశంలో కమిషనర్ అనితా రామచంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, అన్ని జిల్లాల పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.