రాష్ట్రీయం

ఏపి వల్లే సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ సమస్యలను జఠిలం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వ రరావు ఆరోపించారు. శనివారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ, హైకోర్టు విభజన సరైంది కాదని ఏపి పాలకులు అనటం విడ్డూరంగా ఉంద న్నారు. హైకోర్టు విభజన జరగాలని, దీనిపై తెలంగాణ ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు.
కాగా, తెలంగాణలో అత్యధికంగా జాతీయ రహదారులను తెచ్చుకోగలి గామ ని, ఆ పనులు త్వరలోనే ప్రారంభమ వుతా యని తుమ్మల చెప్పారు. సూర్యాపేట, అ శ్వారావుపేట జాతీయ రహదారి పనులు ఈ నెలలోనే ప్రారంభమవుతాయన్నారు. మిషన్ కాకతీయ పథకం అమల్లో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో 10,122 చెరువులను రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేశామని, శ్రీరాంసాగర్ రెండో దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ ఏడాది ఆగస్టు నాటికి 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రయ త్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇదిలావుండగా మల్లన్నసాగర్, శ్రీరాం సాగర్, భక్తరామదాసు ప్రాజెక్ట్‌ల విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఎలా కట్టాలని తుమ్మల ప్రశ్నించారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల