రాష్ట్రీయం

అప్పన్నస్వామి అంతరాలయంలో స్వర్ణకాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 15: కృతయుగ దైవం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుతీరివున్న సింహాచలం దేవాలయం అంతరాలయం స్వర్ణకాంతులతో శోభిల్లనుంది. స్వామివారికి అత్యంత సమీపంలో పైభాగంలో ఉన్న మరో మండపానికి బంగారు తాపడం పనుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమయింది. చెన్నై నుండి వచ్చిన ప్రత్యేక బృందం ప్రస్తుతం ఉన్న వెండి రేకులను తొలగించి కొలతలను సేకరించారు. వెండి మండపానికి ఉన్న దేవతావిగ్రహాలు, శంకు, చక్ర, నామం సంప్రదాయ అలంకరణలతో సిద్ధం చేసిన రాగి రేకులను తీసుకువచ్చి అమర్చి సరిచూశారు. ప్రహ్లాద మండపం మొత్తం స్వర్ణ తాపడం చేస్తారు. దానిపై భాగంలో ఉన్న మరో మండపం ముందు భాగం కూడా స్వర్ణ తాపడం చేస్తారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఎఇఒ ఆర్‌వివిఎస్ ప్రసాద్, డెప్యూటీ స్తపతి డిఎస్‌ఎస్‌ఎన్ రాజు శిల్పిరాజు, ప్రధాన అర్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ సమక్షంలో మండపం పరిశీలన, వెండిరేకు తొలగింపు, కొలతల పనులను మద్రాసు బృందం చేపట్టింది. తొలగించిన వెండి రేకులను అధికారులు తూకం వేసి భద్రపరిచారు. స్వర్ణ తాపడం పనులు జనవరి మొదటి వారంలో పూర్తి చేసేందుకు అధికారులు, చెన్నై బృందం సభ్యులు నిర్ణయించారు. ఈ మొత్తం స్వర్ణ తాపడం పనులకు సంబంధించి ఓ భక్తుడు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. మొత్తం స్వర్ణ కాంతులకు సంబంధించిన బాధ్యతను ఆ భక్తుడు తీసుకున్నారు. ఇందుకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారమందిస్తున్నారు. స్వర్ణ తాపడం పనులకు 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చయ్యే అవకాశముందని అంచనా. వాస్తవానికి ప్రహ్లాద మండపం స్వర్ణ తాపడం పనులు దేవస్థానమే చేపట్టాలని నిర్ణయించి చాన్నాళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది. మూడున్నర కేజీల బంగారం, కొంత సొమ్ము కూడా దేవస్థానం అధికారులు స్వయంగా వెళ్లి అప్పగించివచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తిరుమల దేవస్థానం స్వర్ణ తాపడం పనులు చేయలేమని చేతులెత్తేసింది. ఇచ్చిన బంగారాన్ని తీసుకెళ్లిపోవాలని లిఖితపూర్వకంగా తెలియజేసింది.
పోలీసులు, రైతుల మధ్య తోపులాట దృశ్యం