రాష్ట్రీయం

అధికారుల కిడ్నాప్‌కు మావోల పన్నాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను కిడ్నాప్ చేసేందుకు సిపిఐ మావోయిస్టు పార్టీ పన్నాగం పన్నినట్లు ఏపి పోలీసులు ఆధారాలను సేకరించారు. ఇటీవల ఉత్తరాంధ్ర ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత ఆజాద్ అలియాస్ గోపాల్ వద్ద బ్యాగులో ఉన్న ల్యాప్‌టాప్‌ను ఏపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను ఏపి సైబర్ పోలీసులు విశే్లషించినప్పుడు మావోయిస్టుల కుట్ర కోణం బహిర్గతమైంది. ఈ వివరాలను ముఖ్యమంత్రికి పోలీసు శాఖ నివేదికగా ఇచ్చింది. ఆజాద్ ఈ ఏడాది మే 4న కొయ్యూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతాల్లోని అధికారులను కిడ్నాప్ చేసేందుకు ఎత్తుగడతో మావోయిస్టు పార్టీ ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళిక వారి వద్ద ఉన్నట్లు ల్యాప్‌టాప్‌లోని వివరాల ద్వారా వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఏజన్సీలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా పోలీసు యంత్రాంగానికి తమ కదలికలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఒరిస్సా, చత్తీస్‌గడ్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో ఒరిస్సా, చత్తీస్‌గడ్, ఆంధ్ర మావోయిస్టు దళాలు తరచుగా కలుసుకుని సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇంతవరకు మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతంలో నలుగురిని హత్య చేసింది. అలాగే పోలీసులు కూడా డిసిఎం క్యాడర్‌లో శబరిదళంకు చెందిన ఒక మావోయిస్టును అరెస్టు చేశాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ల్యాప్‌టాప్‌లో మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. మావోయిస్టుల వద్ద ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు, పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. ఆధునిక టెక్నాలజీ వల్ల మావోయిస్టులు, వారి సానుభూతిపరుల కదలికలు సులువుగా తెలియడం వల్ల అడవుల్లోకి పేలుడు పదార్థాలను తరలించడం క్లిష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.