రాష్ట్రీయం

అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 4: ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక్క గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకం..దేశంలో ఏ నదికీ ఆది, అంత్య పుష్కరాలు లేవు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఏడాది పొడవునా గోదావరి పుష్కరాలు, గురుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు జరుగుతాయి. అయితే అంత్య పుష్కరాలు మాత్రం గోదావరి నదికి మాత్రమే ఉండటంతో జూలై 31 నుంచి గోదావరి నదికి అంత్య పుష్కరాలు ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నాయి. అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి రివర్ సిటీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సర్వ సన్నద్ధమైంది. అంత్య పుష్కరాలు పూర్తయిన తర్వాత మరో మూడు రోజుల పాటు గోదావరి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహించనున్నారు. అంత్య పుష్కరాలను ఆధ్యాత్మిక ప్రాశస్థ్యంతో ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు.