ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సాధికార సర్వేతో పాలన సులువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 8: రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను రూపుమాపి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందించడమే ప్రజా సాధికార సర్వే ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన తొలివిడత ప్రజాసాధికార సర్వేను చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంనుండి లాంఛనంగా ప్రారంభించారు. సిఎం కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని సర్వే దరఖాస్తులో నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజా సాధికార సర్వేను రాష్ట్రంలో రెండు విడతలుగా చేపడుతున్నట్లు వివరించారు. మొదటి విడత ఈ నెల 8నుండి 31 వరకు, రెండోవిడత ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నామని తెలిపారు. సాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు, ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక ఇంటి నెంబర్ రూపొందిస్తారన్నారు. రాష్ట్రంలో సుమారు 4.90 కోట్ల ప్రజల వివరాలు ఈ సర్వే ద్వారా సేకరిస్తామన్నారు. ఈ సర్వే ద్వారా సమీకరించే కాగిత రహిత డేటా రాబోయే రోజుల్లో పారదర్శక పాలనకు సమర్థవంతంగా ఉపయోగపడుతుందన్నారు.

చిత్రం... ఐరిస్ తీయించుకుంటున్న చంద్రబాబు, లోకేష్