రాష్ట్రీయం

అన్ని సమస్యలనూ సభలో చర్చిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అన్ని ప్రజాసమస్యలను చర్చించేందుకు వైకాపా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎదురుదాడి చేస్తే తిప్పికొడతామని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని బిఏసి సమావేశంలో తమ పార్టీ కోరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా లేకుండా ఆర్థిక లోటుతో మండుతున్న ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా, ప్రజా సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం లభించే విధంగా అసెంబ్లీలో పోరాడుదామని అన్నారు.
బుధవారం లోటస్‌పాండ్‌లో జరిగిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను పీడించి, వేధింపులకు గురిచేసిన కాల్‌మనీ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిస్తామన్నారు. ఈ కాల్‌మనీ రాకెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి సంఖ్యాబలం దృష్ట్యా మాట్లాడేందుకు, వివిధ అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ పొందేందుకు వీలుగా సభాపతి సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారం మితిమీరిపోయి మహిళలను వేధించే స్థాయికి రాకెట్ సభ్యులు దిగజారినా విజయవాడలోనే మకాం చేసి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు చివరివరకు తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ తదితర అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే సమాధానం దాటవేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కూడా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయకుండా కప్పదాటు వైఖరితో ఉన్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ హోదాను తేవాలన్న సంగతిని మర్చిపోయి రాష్ట్రాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు స్వరూపాన్ని బహిర్గతం చేస్తామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా శాంతియుతంగా ఉండి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు.
ఈ సమావేశం తర్వాత వైకాపా ఉపనేతలు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విఆర్‌ఏ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలనుప్రస్తావిస్తామన్నారు. విచ్చలవిడి కల్తీ మద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తామన్నారు. ఇసుక, భూమి మాఫియాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కాగా వైకాపా ఎమ్మెల్యేలు గురువారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి చేరుకుంటారు.

వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్