రాష్ట్రీయం

జై తెలంగాణ-జై ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: జై తెలంగాణ, జై ఆంధ్ర ఇదే మా నినాదం అని టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. అంతేకానీ జై సమైక్యాంధ్ర నినాదం మాత్రం కాదని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో జరిగిన అమెరికా తెలంగాణ సంఘం (ఆటా) ప్రపంచ ప్రథమ మహాసభల వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జై ఆంధ్ర, జై తెలంగాణ అంటే కొందరు తప్పు పడుతున్నారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇదేమీ తాము కొత్తగా అనడం లేదని తెలంగాణ ఉద్యమ కాలంలోనే తెలంగాణ, ఆంధ్ర రెండూ అభివృద్ధి చెందుతాయని, రెండు రాష్ట్రాలు అయితే రెండు ప్రాంతాల వారికీ ప్రయోజనం అన్నామన్నారు. జై ఆంధ్ర జై తెలంగాణ మన నినాదం, సమైక్యాంధ్ర మాత్రం కాదు అని తానంటూంటే, కొందరు కవిత జై ఆంధ్ర అన్నారంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటామని, అయితే తెలంగాణలో ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని అంగీకరించేది లేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇలా ఉండగా, అమెరికాలో యాదగిరి లక్ష్మీనరసింహుడిని ప్రతిష్ఠించడం శుభసూచకమని కవిత అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని, మరోవైపు ఉపాధి అవకాశాలు పెంచుతున్నట్టు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా విధానాలకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.
ఇటీవల తాను పార్లమెంటరీ కమిటీ తరపున అమెరికాలో పర్యటించినప్పుడు టిఎస్ ఐ పాస్ గురించి వివరించానని, రైట్ టూ పర్మిషన్ అనేది బిజినెస్‌మెన్‌కు ఇస్తుండడం పట్ల అమెరికా పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అమెరికాలో కూడా అలాంటి విధానాన్ని రూపొందించలేదని అమెరికన్లు మెచ్చుకున్నారని కవిత వివరించారు. తెలంగాణ పోరాటంలో ఏనాడూ హింసకు తావు ఇవ్వలేదని, గాంధీజీ సత్యాగ్రహ విధానానే్న తామూ నమ్మామని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిని తెలియజేయాల్సి ఉందని అన్నారు. దీనికి ఆటా వేదిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పేరుతో ఎన్ని సంఘాలు ఉన్నా మంచిదే అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటను ప్రస్తావించారు. అవకాశం ఉంటే అంతా కలిసి పని చేయాలని కోరారు. అమెరికాలోని అన్ని తెలంగాణ సంఘాలను కలుపుకొని ఆటా పని చేయాలని సూచించారు. అదే విధంగా ఆల్ ఇండియా సంఘాలతో కలిసి కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పారు. తెలంగాణ తరపున కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

చిత్రం.. అమెరికాలో జరిగిన ఆటా ప్రపంచ ప్రథమ మహాసభల వేడుకల్లో ప్రసంగిస్తున్న ఎంపి కవిత