రాష్ట్రీయం

పోలీసు కస్టడీకి శ్రాహిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: రాజేష్, రమ్య దుర్మరణం కేసులో మద్యం సేవించి కారు నడిపిన నిందితుడు ఇంజనీరింగ్ విద్యార్థి శ్రాహిల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు షాహిల్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పంజగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం తాగి కారు నడిపిన శ్రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సోమవారం కోర్టులో హాజరుపరచిన శ్రాహిల్‌ను మంగళవారం పోలీస్ కస్టడీకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించనున్నారు.
ఈ నెల ఒకటో తేదీన శ్రాహిల్ తన స్నేహితులతో కలసి మద్యం సేవించి కారు నడపడంతో పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి కారు కిందపడి, ఫ్లై ఓవర్ కింద కారులో ప్రయాణిస్తున్న రమ్య కుటుంబ సభ్యులపై పడింది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె తల్లి రాధిక, చిన్నాన్న రమేష్, తాత తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన రమ్య శనివారం రాత్రి మృతి చెందింది. కారు నడిపిన శ్రాహిల్‌ను మంగళవారం తమ కస్టడీలోకి తీసుకొని అతనితో పాటు అతని స్నేహితులను విచారించనున్నట్టు వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు.
కొవ్వొత్తులతో నివాళి
చిన్నారి రమ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కెబిఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రమ్య హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన చిన్నారి రమ్య కుటుంబసభ్యులు, బంధువులు