రాష్ట్రీయం

విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: ఉత్తరాదిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావం నెలకొనడంతో తెలంగాణ జిల్లాల్లో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. చత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ కోస్తాను ఆనుకుని అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని సోమవారం రాత్రి ప్రకటించింది. దీని ప్రభావంతో కోస్తాలో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.