ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ శాఖలకు సిఎం రేటింగ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. స్కూల్లో విద్యార్థులకు ప్రోగ్రస్ కార్డు ఇచ్చినట్టు, అధికారులకు రేటింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కొత్త విధానానికి తెర తీశారు. ఈ రేటింగ్ వివరాలను సిఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచారు. ఇందులో నాలుగు విభాగాలు ఉన్నా యి. త్రీ స్టార్, టూ స్టార్, సింగిల్ స్టార్, జీరో స్టార్. ప్రభుత్వంలోని ప్రధాన శాఖలకు మాత్రమే సిఎం రేటింగ్ ఇచ్చారు.

త్రీ స్టార్ రేటింగ్
ప్రణాళిక శాఖ, భూగర్భ జల శాఖ, ఇంధన శాఖ, పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, పోలీస్, రెవెన్యూశాఖ

టూ స్టార్ రేటింగ్
వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, వాణిజ్యపన్నుల శాఖ, పరిశ్రమల శాఖ, వాటర్ రిసోర్సెస్ శాఖ, ఎక్సైజ్, అటవీ శాఖ, కార్మిక శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, స్ర్తి శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ శాఖ, సిఆర్‌డిఎ

సింగిల్ స్టార్
ఆధార్ సీడింగ్, ఐటి, పంచాయతీరాజ్ శాఖ

నో స్టార్
ఆర్థిక శాఖ, ఉన్న విద్యాశాఖ, రోడ్లు, భవనాల శాఖ, పర్యాటకం, గృహ నిర్మాణ శాఖ, మత్స్యశాఖ, ఖనిజ శాఖ, పాఠశాల విద్యా శాఖ.
ఈ రేటింగ్‌లపై కొంతమంది ఉన్నతాధికారులు మాట్లాడుతూ వీటి వలన తమ ఆత్మస్థయిర్యం దెబ్బతింటోందంటున్నారు. ‘చేతినిండా పని ఉన్న సంక్షేమ శాఖలకు మంచి రేటింగ్ రావడం సహజం. కొన్ని శాఖల్లో రోజువారీ పని ఉండకపోవచ్చు. అలాగే, ఆయాశాఖలు పనిచేసినా బయటకు కనిపించకపోవచ్చు. కొన్ని శాఖలు సీజనల్‌గా పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి శాఖలకు రేటింగ్ రాదు. ఆయా శాఖల్లో అధికారులు పనిచేయడం లేదంటే సరికాద’ని వారు అంటున్నారు.