ఆంధ్రప్రదేశ్‌

కుదరని ముహూర్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 12: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రెండోవిడత ఉద్యోగుల తరలింపునకు ముహూర్తం కుదరటంలేదు..నిర్దేశించిన గడువుప్రకారం బుధవారం ఐదో బ్లాక్‌కు మరో మూడు శాఖలను తరలించాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, కార్మికశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉద్యోగులు సుమారు 200 మంది వరకు ప్రత్యేక బస్సులలో తరలివచ్చేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఇంటీరియర్ డెకరేషన్ పనులు ఇంకా పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు.
మంగళవారం సచివాలయ పనులను పరిశీలించిన ఏపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తరలింపును వాయిదావేసే విషయమై పురపాలకశాఖ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. ఈనెల 13,15 తేదీలలో ఐదో బ్లాక్ కేటాయించిన శాఖల ఉద్యోగులంతా తరలి రావాల్సి ఉన్నప్పటికీ ముహూర్తం సరిగా లేనందున 21, 29 తేదీలలో వీరిని తరలించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మురళీకృష్ణ మంత్రి నారాయణకు సూచించారు. అందుకు నారాయణ అందుకు అంగీకరించారు. దీంతో తరలింపు ప్రక్రియ వాయిదాపడింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సచివాలయ భవనాలలో చిన్న చిన్న పనులు కూడా పూర్తిస్థాయిలో నిర్వహిస్తే విధుల నిర్వహణకు అవరోధాలు ఉండవన్నారు. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పదిశాతం త్వరలో పూర్తికాగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టాయిలెట్స్ కనెక్షన్, ఫైల్స్ రాక్స్ ఏర్పాటు మాత్రమే మిగిలి ఉందన్నారు. 29 నుంచి ఐదో బ్లాకులో ఉద్యోగులు విధులు నిర్వర్తించే వీలు కలుగుతుందని వివరించారు. ఇదే విషయాన్ని మంత్రి నారాయణకు వివరించగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉద్యోగుల కుటుంబాలు తరలిరావాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తాము శిరసావహిస్తామన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి తరలింపు పూర్తవుతుందని తెలిపారు.