ఆంధ్రప్రదేశ్‌

యువశక్తే మహాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 12: దేశ భవిష్యత్తుకు, ప్రపంచ గమనానికి యువత నాంది పలకాలని, యువశక్తే దేశానికి మహాశక్తి అని కేంద్ర ఇంధనం, బొగ్గు గనులశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ యువజన మహోత్సవం-2016 ను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ గమనాన్ని మార్చే శక్తి యువతకుందన్నారు. ప్రేమ, దైవత్వం, సంతోషాలకు ప్రతీక సత్యసాయి బాబా అని అన్నారు. భారతదేశం అఖండ ఆధ్యాత్మిక శక్తికి నిలయమన్నారు. జాతి నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి యువత స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మాగాంధీ, వీర సావర్కర్, శ్రీనివాస రామానుజంలా ఎదగాలన్నారు. దేశం నాకేమిచ్చింది అని కాక, దేశానికి నేనేమిచ్చాను.. అని అందరూ ఆలోచించాలన్నారు. సమాజంలో అట్టడుగు వారి అభివృద్ధి, సంక్షేమానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. దేశ్, దాన్, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్ అనే ఐదు ‘డి’లను అలవర్చుకుని యువత దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. గతంలో తాను పుట్టపర్తి వచ్చానని, సత్యసాయిబాబా ప్రభావం తనపై ఉందన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా మానవాళికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఫైన్ పుట్టపర్తి.. సత్యసాయి జ్యోతి మెడిటేషన్, విత్ యూ ఫర్ ఎవర్ పుస్తకాలను మంత్రులు ఆవిష్కరించారు. తొలుత మంత్రి గోయల్ సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి ప్రత్యేకంగా దర్శించుకుని ప్రణమిళ్లారు. కాగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం ప్రపంచ యువజన మహోత్సవం-2016 ఘనంగా ప్రారంభమైంది. సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యూత్ కో ఆర్డినేటర్ డాక్టర్ శివేంద్రకుమార్, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నమిష్‌పాండ్య, సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్, సత్యసాయి ట్రస్టు కార్యదర్శి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.