ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 12: వర్షాకాల సమావేశాల్లో విభజన హామీలు.. ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం.. విపక్షాలు ప్రవేశపెట్టే బిల్లులపై ఆచితూచి అడుగేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటయి ఇప్పటికి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు.. విశాఖ రైల్వేజోన్ అంశాలను ప్రస్తావించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీన విజయవాడలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. మంగళవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం హామీలు ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదని, షెడ్యూల్ 9,10 సంస్థల బదలాయింపుపై కేంద్రం ఇప్పటికీ స్పందించక పోవటంతో మరోసారి గుర్తుచేయటంతో పాటు హామీల అమలుకు ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. దీంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక్కో జిల్లాకు కేవలం రూ. 50 కోట్లు మాత్రమే కేటాయించారని దీనిపై కూడా చర్చించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్యేల సీట్లు 50కు పెంచే విషయమై సుప్రీం కోర్టు లా కమిషన్‌కు నివేదించటంతో పాటు పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తామన్నారు. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశ ఆర్ధికాభివృద్ధికి అవసరమన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరరావు ప్రవేశపెట్టనున్న ప్రైవేటు మెంబర్స్ బిల్లుపై ముందు రాజ్యసభలో చర్చించిన అనంతరం పార్లమెంటులో స్పందించాలని తెలుగుదేశం భావిస్తోంది. కాంగ్రెస్ విభజన సమయంలో ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించడం ద్వారా ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయటంతో పాటు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జిలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. 20వ తేదీ తరువాత ముఖ్యమంత్రి నేతృత్వంలో 500 మంది వరకు ప్రజాప్రతినిధులకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని కళా వెంకట్రావు తెలిపారు. 32వేల మంది ద్వితీయశ్రేణి నాయకులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
15 నాటికి మోడల్ ఘాట్
విజయవాడ, జూలై 12: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణాపుష్కరాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనుల్లో పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తూ, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కేవలం పుష్కరాల కోసమే కాకుండా కృష్ణా రివర్ డెవలప్‌మెంట్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన పనులను చేపడుతున్నట్టు ఇందులో భాగంగా బ్యారేజీకి అధునాత విద్యుత్ దీపాలకరణతో పాటు నదీ పరివాహక ప్రాంతమంతా గ్రీనరీతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.