రాష్ట్రీయం

అక్రమాలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: మైనింగ్ అక్రమాలను సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ఐటి, మైనింగ్ మంత్రి కె తారక రామారావు హెచ్చరించారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రైవేటు పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని అధికారుల బృందం పరిశీలించింది. జిల్లాలోని గుడిబండ పట్ట్భామిలో 1950 క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే, చట్టవిరుద్ధంగా సుమారు 60వేల క్యూబిక్ మీటర్లమేర తవ్వకాలు చేపట్టారు. అనుమతించిన భూభాగం పరిమితులు దాటి తవ్వకాలు చేపట్టినట్టు మంత్రి పంపించిన అధికారుల బృందం తేల్చింది. ప్రైవేటు వ్యక్తులు ఇలా చట్టవిరుద్ధంగా చేస్తున్న తవ్వకాలను నియంత్రించడంలో విఫలమైన ఆదిలాబాద్ జిల్లా ఎడి కృష్ణప్రతాప్‌తో పాటు రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని కెటిఆర్ ఆదేశించారు. ఆ స్థానంలో మరో ఇద్దరిని నియమించి పకడ్బంధీగా ఇసుక తవ్వకాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పరిమితులకు మించి త్వవకాలు జరిపిన కాంట్రాక్టర్ అనుమతులను రద్దు చేయించారు. చట్ట ప్రకారం పెనాల్టీవేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అధికారులు అక్రమ మైనింగ్ ఆపేందుకు కృషి చేయాలని, దీనిలో విఫలమైతే ఇలానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపైన భారీగా పెనాల్టీలు విధించాలని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఇసుక తవ్వకాలు, మైనింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా మైనింగ్, ఇసుక తవ్వకాలమీద మంత్రి అధికారులతో వారం రోజులుగా నిరంతరం సమీక్షిస్తూ వస్తున్నారు. గనుల శాఖలోని వివిధ అంశాలపై పలుమార్లు సమావేశమై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ మీద వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించాలని మైనింగ్ శాఖ అధికారులను కెటిఆర్ ఆదేశించారు. టియస్ యండిసి ఎండి ఇలంబర్తి, డైరెక్టర్ మైన్స్ సుశీల్‌కుమార్‌లతో కూడిన అధికారుల బృందాన్ని పలు ప్రాంతాల్లో పర్యటించి, నేరుగా పర్యవేక్షించాలని కెటిఆర్ కోరారు. ఎక్కడైనా అక్రమాలు జరిగాయని తేలితే వెంటనే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారుల బృందం నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరుపై అధికారులు నివేదిక ఇచ్చారు. అక్రమాలపై మంత్రి చర్యలకు ఆదేశించారు. మైనింగ్ ఆదాయం జాతి సంపద, అందులో అక్రమాలను సహించేది లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. అక్రమాలను అరికట్టేందుకు కఠినంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వారానికోసారి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి నేరుగా పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.