రాష్ట్రీయం

‘తొక్కిసలాట’ నివేదికను బహిర్గతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట, 30మంది మృతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని వైకాపా, కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
వైకాపా అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి విలేఖర్లతో మాట్లాడుతూ సంవత్సరం పూర్తయినా ఇంతవరకు విచారణ కమిటీ నివేదికను బయటపెట్టలేదన్నారు.
చంద్రబాబు వ్యవహారశైలి వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. విజయవాడలో దేవాలయాలను ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేయడం దారుణమన్నారు. హిందూ ధార్మిక వ్యతిరేక విధానాలకు టిడిపి ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. పిసిసి అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అతి ప్రచారం మోజు వల్లనే గోదావరి పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటన జరిగిన ఏడాది అవుతున్నా, విషాదానికి దారితీసిన కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదన్నారు. కమిటీ నివేదికను బయటపెట్టాలన్నారు. వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.