ఆంధ్రప్రదేశ్‌

మదన్ మోహన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలతో కృష్ణా, గోదావరి జలాల పంపకంపై తరచుగా తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకు జస్టిస్ మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనే డిమాండ్ తెరపైకి రానుంది. శనివారం ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్‌ను ప్రస్తావించనున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో జలాల పంపకంపై సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో యుపిఏ ప్రభుత్వం 2007లో జస్టిస్ మదన్ మోహన్ పూంచి కమిషన్‌ను ఈ సమస్యల పరిష్కారం కోసం సిఫార్సులు చేయాలని నియమించింది.
ఈ కమిషన్ 2010లో ఒక నివేదికను కేంద్రానికి ఇచ్చింది. నదీ జలాల పంపకానికి శాశ్వత ప్రాతిపదికన సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాలని, ఈ కమిటీ సిఫార్సులే తుది నిర్ణయంగా అమలు చేయాల్సి ఉంటుందని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సులకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని కోరింది. ప్రస్తుతం ట్రిబ్యునళ్లను జలాల కేటాయింపులకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రిబ్యునళ్ల కేటాయింపులు వివాదాలకు దారితీస్తున్నాయి. పైగా కోర్టు లిటిగేషన్లు ఏళ్లతరబడి నడుస్తున్నాయి. శనివారం ఢిల్లీలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పూంచి కమిటీ సిఫార్సులు అమలు చేస్తే నదీ జలాల కేటాయింపులను సుప్రీం కోర్టు జడ్జి ఖరారు చేస్తారు.
సుప్రీం కోర్టు కూడా ఈ విషయమై తదుపరి జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ కమిటీలో జల, ఇంజనీరింగ్, బ్యూరోక్రట్ అధికారులు ఉండాలని కమిటీ గతంలో పేర్కొంది. ప్రస్తుతం నదీ జలాల బోర్డులు, ట్రిబ్యునళ్ల ఆదేశాలు, సిఫార్సులు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా జలాల కేటాయింపును పునఃసమీక్షించాలని తెలంగాణ రాష్ట్రం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మరో వైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బచావత్ ట్రిబ్యునల్ తమకు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అలాగే గోదావరి నదిపై నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పట్టిసీమ లిఫ్ట్ స్కీంను చూపెట్టి తమకు 80 టిఎంసి నీటిలో వాటా ఇప్పుడే ఇచ్చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.