ఆంధ్రప్రదేశ్‌

ఇలా ఉంటే ఎలా తింటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: కొన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థ పాచిపోయిన భోజనాన్ని పిల్లలకు పెడుతోందని, ఈ సంస్థ పనితీరును తూర్పు గోదావరి జిల్లాలో కూడా పరిశీలన జరిపి, నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని శాసన మండలి హామీల అమలు కమిటీ అధికారులను ఆదేశించింది. ఆ సంస్థ మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. శాసన మండలి హామీల అమలు కమిటీ ఛైర్మన్ గాలి ముద్దు కృష్ణమనాయుడు అధ్యక్షతన శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి, విశాఖ జిల్లాల అధికార్లతో సమీక్ష జరిపింది. కొన్ని జిల్లాల్లో ఇస్కాన్ సంస్థ పిల్లలకు పాచిపోయిన అన్నం పెడుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ పథకం నిర్వహణ బాధ్యతలు ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాలకు అప్పగిస్తే అప్పటికపుడు వండి, తాజా భోజనం పెట్టడానికి వీలుకలుగుతుందని, మహిళా సంఘానికి ఉపాధి కూడా లభిస్తుందని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది.
కోస్టల్ కారిడార్‌కు సంబంధించి పనుల పురోగతిని విశాఖ వుడా వైస్ చైర్మన్, కోస్టల్ కారిడార్ సిఇఓ బాబూరావునాయుడు వివరించారు. విశాఖ-చెన్నై కారిడార్ కూడా ఏర్పాటవుతున్న నేపథ్యంలో కోస్టల్ కారిడార్ మాస్టర్ ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందన్నారు. ఈ కారిడార్‌లో వచ్చే ప్రధాన పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సివుంటుందని వివరించారు. తీరం వెంబడి మత్య్సకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాసాన్ని కల్పించాలని ఛైర్మన్ ముద్దు కృష్ణమనాయుడు, సభ్యుడు ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి ఆదేశించారు. పోలవరం భూసేకరణలో కొత్త చట్టం ప్రకారం పునరావాసం ఏ విధంగా కల్పిస్తున్నదీ కమిటీ సభ్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క పునరావాసానికే సుమారు నాలుగు వేల కోట్లు ఖర్చు కానుందని చెప్పారు. పోలవరం ముంపు మండలాల్లో దాదాపు 90 వేల ఎకరాల భూసేకరణలో నష్టపరిహారమంతా అపుడే ఇచ్చామని వివరించారు. జల రవాణా ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ హరికృష్ణ కమిటీకి వివరించారు. అంతకుముందు కమిటీ సభ్యులు రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి పుష్కర పనులను పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేశారు.

5వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు

మధురవాడ, జూలై15: రాష్ట్రంలో 5 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ సమీపంలోని మధురవాడ చంద్రంపాలెంలో శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవా సంస్థలు తమ వంతు సహకారాన్ని అందజేయాలన్నారు. ప్రవాసాంధ్రులు 30 శాతం, ప్రభుత్వం 70 శాతం నిధులతో రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.

వైభవంగా రామకోటి నిమజ్జనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం తొలి ఏకాదశి పూజలు, రామకోటి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.