ఆంధ్రప్రదేశ్‌

వైద్య సేవలకు బిల్‌గేట్స్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య విభాగాల్లో కలిసి పనిచేయడానికి బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరుస్తోంది. అలాగే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆ రంగంలో సాంకేతికతను వినియోగించుకునే విషయంలో పూర్తి సహకారం అందించేందుకు కూడా అంగీకారం తెలిపింది. సిఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్భ్రావృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకారాన్ని ఆశిస్తున్నట్లు చంద్రబాబు తెలపగా అందుకు కూడా అంగీకారం లభించింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఆరోగ్యరంగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్, టెక్నాలజీ పార్టనర్స్‌గా ఉండాలని కోరారు. ప్రధానంగా ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తృతం చేసేందుకు ఉత్తమ మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. ఆరోగ్య రంగంలో నిర్వహిస్తున్న ఇ-ప్రగతి కార్యక్రమంలో సలహాదారుగా వ్యవహరించాలని, ఆసక్తి ఉన్న సంస్థలన్నింటినీ భాగస్వాములను చేయాల్సిందిగా కోరారు. ఆగస్టులో తాము రాష్ట్రంలో పర్యటించగలమని హామీ ఇచ్చారు.